ఏకంగా గవర్నర్ కే బెదిరింపు లేఖ!

ప్రధమ పౌరురాలైన గవర్నర్ కు ఆగంతకులు బెదిరింపు లేఖ రాసినట్లు తెలుస్తుంది.పదిరోజుల్లో గా గవర్నర్ రాజ్ భవన్ ను ఖాళీ చేయకుంటే డైన మెట్ల తో భవనాన్ని పేలుస్తానంటూ ఒక ఆగంతకుడు బెదిరింపు లేఖ రాసినట్లు తెలుస్తుంది.

 Rajbhavan Gets Letter-TeluguStop.com

ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అయిన ఆనందిబెన్ పటేల్ కు ఒక ఆగంతకుడు బెదిరింపు లేఖ రాసి రాజ్ భవన్ కు పంపించాడు.

పదిరోజుల్లోగా గవర్నరు ఆనందిబిన్ పటేల్ రాజ్‌భవన్‌ను ఖాళీ చేయకుంటే డైనమెట్లతో భవనాన్ని పేలుస్తామని జార్ఖండ్ టీఎస్‌పీఎస్ పేరిట సంతకంతో బెదిరింపు లేఖ వచ్చింది.ప్రథమ పౌరురాలైన గవర్నరుకే బెదిరింపు లేఖ రావడంతో యూపీ హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు.

రాజ్ భవన్ కు వచ్చిన లేఖపై పోలీసు ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ హేమంత్ రావుకు నివేదిక సమర్పించారు.మరోపక్క ఈ బెదిరింపు లేఖపై హజ్రత్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యకే పోలీసు బృందం తో దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తుంది.

Telugu Rajbhavan-Telugu Political News

2014 నుంచి 2016 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆనంది బెన్ అనంతరం మధ్యప్రదేశ్ గవర్నర్ గా పని చేశారు.అయితే ఈ ఏడాది జులై 20వతేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ఆనందిబెన్ పటేల్‌ను రాష్ట్రపతి బదిలీచేయడం తో ఆమె అక్కడ భాద్యతలు నిర్వహిస్తున్నారు.అయితే ఒక గవర్నర్ హోదా లో ఉన్న ఆమె కి బెదిరింపు లేఖ రావడం యూపీలో సంచలనం రేపుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube