అదరగొడుతున్న 'రాజావారు రాణిగారు' ట్రైలర్  

Rajavaru Ranigaru Trailer Release-rajavaru Ranigaru

ప్రేమ కథ చిత్రాలకు సినిమా ప్రపంచంలోను అటు ప్రేక్షకుడి మనసులోనూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.ఇప్పుడు కొత్త గా వస్తున్న దర్శకులు కూడా నిజమైన ప్రేమ కథ చిత్రాలను తీసుకుని ఆ కథకు తమ దర్శక ప్రతిభ, రచన నైపుణ్యాన్ని అద్ది చక్కటి ప్రేమ కథ చిత్రాలను రూపొందిస్తున్నారు.ఇప్పడు యూత్ కుడా ఎక్కువగా ప్రేమ కథ చిత్రాలను చూడటానికి ఇష్టపడుతున్నారు.మరి ముఖ్యంగా గ్రామీణ నేపద్యంలో ప్రేమ కథ చిత్రం అంటే, స్వచమైన ప్రేమ, కల్మష్యంలేని మనషులు మద్య ప్రేమ, ప్రతి ఒక్కరికి కుడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

Rajavaru Ranigaru Trailer Release-rajavaru Ranigaru Telugu Tollywood Movie Cinema Film Latest News Rajavaru Ranigaru Trailer Release-rajavaru-Rajavaru Ranigaru Trailer Release-Rajavaru

అలా ఇప్పటి వరకు ఎన్నో ప్రేమ కథలు వచ్చాయి.

సరికొత్త తరహాలో మరో గ్రామీణ నేపద్యం తో కూడిన ఓ ప్రేమ కథ చిత్రం రాబోతుంది.అదే ‘రాజవారు రాణిగారు.’ కిరణ్ కోలా దర్శకత్వంలో తెలుగు తెరకు పరిచయం అవ్వుతున్న కిరణ్, రహస్య జంటగా నటించిన చిత్రం ‘రాజావారు రాణిగారు’.ఈ చిత్రం నుండి ఇటివల ట్రైలర్ ను ఈ చిత్రా బృందం విడుదల చేసింది.విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకులనుండి అనూహ్యమైన రెస్పాన్సు వస్తుంది.చిత్రం నుండి కట్ చేసిన కొన్ని లవ్ అండ్ కామిడి తో కూడిన సిన్స్ ట్రైలర్ గా మలిచి విడుదల చెయ్యడంతో మంచి ఆధరణ లభిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రం ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వుతుంది.