సంచలన ఉత్తర్వులు జారీ చేసిన రాజస్థాన్ మానవ హక్కుల కమీషన్  

Rajasthan Human Rights Commission Reacts On Living Relationships-prakash Thanthia,rajasthan Human Rights

ఇటీవల సమాజంలో సహజీవం అనేది చాలా సాధారణ విషయమైపోయింది.అయితే ఈ క్రమంలో మహిళలకు చాలా అన్యాయం జరుగుతుంది అని రాజస్థాన్ మానవ హక్కుల కమీషన్ వాపోయింది.సహజీవనం పేరుతో మహిళలను వాడుకొని వదిలేస్తున్నారు అని కావున ఈ బంధాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేదించాలని పేర్కొంది...

Rajasthan Human Rights Commission Reacts On Living Relationships-prakash Thanthia,rajasthan Human Rights-Rajasthan Human Rights Commission Reacts On Living Relationships-Prakash Thanthia

రాజస్థాన్ మానవహక్కుల కమీషన్ బెంచ్ న్యాయమూర్తులు మహేష్ చంద్ శర్మ,ప్రకాశ్ తాంతియాలతో కూడిన ధర్మాసనం సహజీవనంపై పై విధంగా స్పందించింది.ఈ క్రమంలో సహజీవనం పై బెంచ్ తీవ్రంగా స్పందించింది.సహజీవనం పేరుతో ఆడవారిని కేవలం ఆట బొమ్మలుగా చేసి వాడుకొని వదిలేస్తున్నారు అని బెంచ్ అభిప్రాయపడింది.

సహజీవనం గురించి మాట్లాడుతున్న సందర్భంలో బెంచ్ ఓ ఉదాహరణను కూడా ప్రస్తావించింది.

Rajasthan Human Rights Commission Reacts On Living Relationships-prakash Thanthia,rajasthan Human Rights-Rajasthan Human Rights Commission Reacts On Living Relationships-Prakash Thanthia

వివాహితులైన పురుషులు కేవలం లైంగిక సంబంధం కోసం లేదా ఓ పనిమనిషిలా వాడుకోవడం కోసం మరో మహిళతో సహజీవనం నడుపుతున్నారని దీనితో ఈ సహజీవనంలో మహిళల పరిస్థితి ఉంపెడుగత్తెల్లా మారిపోయిందని వ్యాఖ్యానించింది.అలానే ఆర్టికల్ 21లో పేర్కొన్న మానవ హక్కులకు ఇది విరుద్దం అని వ్యాఖ్యానించిన బెంచ్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సహజీవనం బంధాలను నిషేధించాలి అంటూ సూచించింది.