జాగ్రత్త బ్రో : అమ్మాయి అడిగిందని న్యూడ్ వీడియో కాల్స్ చేస్తే అంతే... 

ఈ మధ్య కాలంలో కొందరు యువతులు అడ్డ దారుల్లో డబ్బులు సంపాదించడం కోసం అందమైన తమ శరీరాల్ని ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారు.కాగా తాజాగా ఓ యువతి మాయమాటలు చెప్పి యువకుడితో పరిచయం ఏర్పర్చుకుని ఆ తరువాత అతడిని మెల్లగా లొంగ దీసుకొని చివరికి నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ ఫోటోలు తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజిన ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వెలుగు చూసింది.

 Rajasthan Woman Blackmailing For Money In Hyderabad, Rajasthan Woman, Blackmaili-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే వీరేష్ (పేరు మార్చాం) అనే 26 సంవత్సరాలు కలిగినటువంటి ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో స్థానిక నగర పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.అయితే ఈ మధ్య కాలంలో వీరేశ్ కాలక్షేపం కోసం సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే ఉపయోగిస్తున్నాడు.

ఈ క్రమంలో రాజస్థాన్ కి  చెందిన ఓ అందమైన యువతితో వీరేష్ కి పరిచయం ఏర్పడింది.ఈ క్రమంలో ఇరువురి నెంబర్లు ఇచ్చి పుచ్చుకొని వాట్సాప్ లో రోజు చాటింగ్ చేసేవారు.

దీంతో యువతి వీరేష్ ని నగ్నంగా చూడాలని ఉందంటూ వీడియో కాల్ చేయాలని కోరింది.దీంతో టెంప్ట్ అయిన వీరేష్ ఏ మాత్రం ఆలోచించకుండా నగ్నంగా వీడియో కాల్ చేశాడు.

Telugu Abuse, Cyber, Hydarabad, Hyderebad-Latest News - Telugu

ఇంకేముంది.అప్పటి నుంచి వీరేష్ కి సమస్యలు స్టార్ట్ అయ్యాయి.నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతుండగా యువతి వీరేష్ ఫోటోలను తీసుకొని బ్లాక్ మెయిల్  చేయసాగింది.అంతేకాక తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తన ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించింది.

దీంతో తన కుటుంబం పరువు, మర్యాదల గురించి ఆలోచించిన వీరేష్ కష్టపడి సంపాదించిన రెండు లక్షల రూపాయలను యువతికి ఇచ్చాడు.అయినప్పటికీ యువతికి ధన దాహం తీరలేదు.

దీంతో మరోమారు యువతి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వమని వీరేష్ ని  అడిగింది.ఇక చేసేదేమీ లేక వీరేష్ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తనని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతి పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరాడు.

దీంతో బాధితుడు తెలిపిన  వివరాల మేరకు  ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ క్రైం  పోలీసులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube