8 మంది మంత్రగాళ్లతో పూజలు చేయిస్తున్న మహిళ.. కారణమేమిటంటే?

గడిచిన మూడు దశాబ్దాల్లో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలిసిందే.మనిషి ఇతర గ్రహాల్లో పరిశోధనలు చేసే స్థాయికి ఎదిగాడు.

 Rajasthan Woman Doing Black Magic With 8 Persons, Snake Bite, Snake Bite Three T-TeluguStop.com

సైన్స్ ద్వారా అంతుచిక్కని ప్రశ్నలకు సైతం సమాధానాలు దొరుకుతున్నాయి.అయితే నేటీకి కొందరు జనం మాత్రం మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు.

మూఢనమ్మకాలతో నేటికీ మంత్రగాళ్లను నమ్ముతూ వారికి భారీ మొత్తంలో చెల్లిస్తున్నారు.

తాజాగా రాజస్థాన్ లోని భరత్ పూర్ లో 22 సంవత్సరాల యువతిని పాము మూడుసార్లు కాటేసింది.

మూడుసార్లు కాటు వేయడంతో యువతి తీవ్ర భయాందోళనకు గురైంది.విషయం తెలిసిన వెంటనే ఆమె కుటుంబ సభ్యులు సమీపంలో ఉన్న ఆర్బీఎం ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు.

అయితే వైద్య సిబ్బంది ఆమెను పరిశీలించి యువతిని పాము కాటు వేయలేదని ఆమె శరీరంపై పాము కాటు వేసిన గుర్తులేవీ లేవని తెలిపారు.

ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకొనివచ్చారు.

భరత్‌పూర్ లోని సంజయ్ నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.పాము కాటుకు గురైన యువతి పేరు సప్నాదేవి.

అయితే పాము కాటు వేసిందని యువతి చెబుతుంటే గుర్తులేవీ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.ఆ తర్వాత పాముకాటుకు మంత్రం వేసే 8 మంది మంత్రగాళ్లను పిలిపించి పూజలు చేశారు.

పాము కాటు వేసిందని మంత్రగాళ్లతో పూజలు చేయించడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.పాము కాటు వేస్తే మంత్రగాళ్లను పిలిపించి పూజలు చేయించడం ఏమిటని కొందరు స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి మూఢ నమ్మకాల వల్లే వెనుకబడుతున్నామని పలువురు స్థానికులు మీడియా ముందు వాపోయారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూఢ నమ్మకాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని….మూఢ నమ్మకాలను ప్రోత్సహించే వారిని కఠినంగా శిక్షించాలని చెబుతున్నారు.మూఢ నమ్మకాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube