ఆ పేరు వలన ఊర్లో యువతకి పెళ్లిల్లు కావట్లేదంట.కాబట్టి ఏం చేశారంటే

ఆ వూరులో యువతకు చదువు లేదా అంటే బాగా చదువుకున్నారు.పోని ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరుమీద పడి తిరుగుతున్నారా అంటే అదీ లేదు.

 Rajasthan Village Miyan Ka Bara Renamed As Mahesh Nagar-TeluguStop.com

అందరూ మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు.పోనీ గ్రామంలో కనీస సౌకర్యాలు లేవా అంటే అన్ని సౌకర్యాలు బాగున్నాయి.

కాని ఆ ఊరి అబ్బాయిలకు పిల్లనివ్వడానికి భయపడుతున్నారు.వారిని అంతగా భయపెడుతున్న అంశం ఏంటేం ఆ ఊరిపేరు.

ఆ గ్రామం పేరు మియాన్ కా బారా హల్ట్.ఆ గ్రామానికి ముస్లిం పేరు ఉండటం వల్ల చాలా సంబంధాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతున్నాయట.దీంతో ఆ గ్రామస్థులు ప్రభుత్వానికి తమ గోడు చెప్పుకున్నారు.వారి వాదనతో ఏకీభవించిన ప్రభుత్వం వారి గ్రామానికి మహేశ్‌పూర్ అని నామకరణం చేసింది.రాజస్థాన్‌లోని బర్మీర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.ఇన్ని సంవత్సరాల తర్వాతైనా అధికారులకు కనికరం కలిగినందుకు ఆనందంగా ఉన్నారు గ్రామస్థులు.

దేశానికి స్వాతంత్య్రం రాకమునుపే మహేశ్‌నగర్ అనే పేరు ఉండేదని… ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పేరును మార్చారట.గ్రామస్థుల కోరిక మేరకే గ్రామం పేరు మార్చడం జరిగిందని… దీనిలో ఎటువంటీ రాజకీయం లేదని స్థానిక ఎమ్మెల్యే స్పష్టం చేశారు.కాగా ఈ గ్రామంలో హిందువులు మెజారిటీ సంఖ్యలో ఉండగా, ముస్లింలు మైనారిటీ సంఖ్యలో ఉన్నారు.ఇక నుండి పెళ్ళిల్లు చేసుకోవడానికి ఇక్కడి యువత ఇబ్బంది పడాల్సిన పని లేదని గ్రామపెద్ద తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube