ఈ రోజు ఐపీఎల్ లో రాజస్థాన్ తో చెన్నై మ్యాచ్ ... ఏ జట్టు కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూడండి...  

Rajasthan Royals Vs Chennai Super Kings Match Prediction-ipl 12th Session,ipl Match Prediction,rajasthan Royals,ఐపీఎల్,చెన్నయ్ సూపర్ కింగ్స్,రాజస్థాన్ రాయల్స్

 • చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు వరస విజయాలతో ఈ ఐపీఎల్ సీజన్ లో దూసుకుపోతుంది. ఆ జట్టు చెన్నై లో ఆడిన అన్ని మ్యాచ్ ల్లో గెలిచి మంచి జోరు మీద ఉంది.

 • ఈ రోజు ఐపీఎల్ లో రాజస్థాన్ తో చెన్నై మ్యాచ్ ... ఏ జట్టు కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూడండి...-Rajasthan Royals Vs Chennai Super Kings Match Prediction

 • ఆడిన 6 మ్యాచ్ లలో ఒక్క ముంబై తో తప్ప అన్ని జట్లతో ఆడిన వాటిలో గెలిచిన చెన్నై జట్టు రాజస్థాన్ తో జరిగే మ్యాచ్ లో గెలిచే ప్లే ఆప్స్ కోసం ఒక అడుగు ముందుకు వేయాలని ప్రయత్నిస్తుంది. ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ జట్టు కోల్ కత్తా తో ఆడిన మ్యాచ్ లో అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో పేలవ ప్రదర్శన చేసి భారీ ఓటమి మూటకట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆప్స్ రేస్ లో ఉండాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిందే.

 • 1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

  ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 21 మ్యాచ్ లు జరగగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 13 మ్యాచ్ లలో గెలవగా రాజస్థాన్ జట్టు 8 మ్యాచ్ లలో గెలిచింది.

  Rajasthan Royals Vs Chennai Super Kings Match Prediction-Ipl 12th Session Ipl Prediction Rajasthan ఐపీఎల్ చెన్నయ్ సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్

  2)పిచ్ ఎలా ఉండబోతుంది

  ఈ మ్యాచ్ రాజస్థాన్ లో జరగనుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించనుంది. లక్ష్యాన్ని ఛేదించే జట్టుకు ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి.

 • 3)రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

  Rajasthan Royals Vs Chennai Super Kings Match Prediction-Ipl 12th Session Ipl Prediction Rajasthan ఐపీఎల్ చెన్నయ్ సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్

  వరుస ఓటములతో పాయింట్ ల పట్టికలో చివరి నుండి రెండవ స్థానం లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓటమి పాలైతే ప్లే ఆప్స్ ఆశలు సంక్లిష్టంగా మారనుంది. ఆ జట్టు యువ ఆటగాళ్లు సంజు శాంసన్ , త్రిపాఠి లు ఫామ్ లోకి రావాల్సి ఉంది.

 • ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో బెన్ స్టోక్స్ పెద్దగా ప్రభావం చూపలేదు. అతడు ఈ మ్యాచ్ లో ఫామ్ లో కి వస్తే ఆ జట్టుకు విజయావకాశాలు ఉండొచ్చు.

 • రాజస్థాన్ రాయల్స్ జట్టు ( PROBABLE XI ) – జాస్ బట్లర్ , రహానే , సంజు శాంసన్ , త్రిపాఠి , స్టీవ్ స్మిత్ , బెన్ స్టోక్స్ , గౌతమ్ , జోఫ్రా ఆర్చర్ , ధవాల్ కులకర్ణి , శ్రేయస్ గోపాల్ , సుదేశాన్ మిదున్

  4)చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఉండబోతుంది

  Rajasthan Royals Vs Chennai Super Kings Match Prediction-Ipl 12th Session Ipl Prediction Rajasthan ఐపీఎల్ చెన్నయ్ సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్

  చెన్నై జట్టు కోల్ కత్తా తో జరిగిన గత మ్యాచ్ లో గెలిచే పాయింట్ ల పట్టికలో అగ్రస్థానాన్ని వెళ్ళింది. ఆ జట్టు బ్యాటింగ్ లో బౌలింగ్ లో బాగానే రాణిస్తున్న ఆ జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ లు అయిన వాట్సన్ , రైనా ఫామ్ లేని సమస్య జట్టుని బాగా ఇబ్బంది పెడుతుంది. రాజస్థాన్ తో జరిగే మ్యాచ్ లో వారు ఫామ్ లో కి వస్తే చెన్నై బ్యాటింగ్ మరింత బలోపేతం అవనుంది.

 • ఇక బౌలింగ్ లో దీపక్ చహార్ , హర్భజన్ , తహిర్ , కుగ్గేలిన్ లతో బలంగా ఉంది. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు గెలిస్తే ప్లే ఆఫ్స్ కి మరింత చేరువవనుంది

  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( PROBABLE XI ) – షేన్ వాట్సన్ , డూప్లెసిస్ , రైనా , ధోని , జాధవ్ , జడేజా , రాయుడు , హర్భజన్ , తహిర్ , దీపక్ చహార్ , కుగ్గేలిన్