ఈ రోజు ఐపీఎల్ లో రాజస్థాన్ తో పంజాబ్ మ్యాచ్.. ఏ జట్టుకు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయో చూడండి  

Rajasthan Royals Versus Kings Xi Punjab Who Will Win The Match-

ముంబై తో జరిగిన తన చివరి మ్యాచ్ లో విజయం సాధించి వరుస ఓటములకు ఫుల్ స్టాప్ పెట్టింది రాజస్థాన్ జట్టు.ముంబై తో జరిగిన మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆ జట్టు పంజాబ్ తో జరిగే మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలు ఉంచుకోవలనుకుంటుంది.

Rajasthan Royals Versus Kings Xi Punjab Who Will Win The Match--Rajasthan Royals Versus Kings Xi Punjab Who Will Win The Match-

ఇటు పంజాబ్ జట్టు గత మ్యాచ్ లో బెంగళూర్ తో ఓటమి పాలైంది.ఆ జట్టు స్టార్ టీ 20 ఆటగాడు క్రిస్ గేల్ కూడా ఫామ్ లోకి రావడం ఆ జట్టు బ్యాటింగ్ ని బలంగా మార్చింది.ఇకపోతే బౌలింగ్ లో శ్యాం కుర్రాన్ , మహమ్మద్ షమీ , అశ్విన్ లతో పటిష్టంగా ఉంది.

Rajasthan Royals Versus Kings Xi Punjab Who Will Win The Match--Rajasthan Royals Versus Kings Xi Punjab Who Will Win The Match-

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 19 మ్యాచ్ లు జరగగా పంజాబ్ జట్టు 9 మ్యాచ్ లలో గెలవగా రాజస్థాన్ జట్టు 10 మ్యాచ్ లలో గెలుపొందింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ ని పంజాబ్ క్రికెట్ స్టేడియం లో జరగనుంది.ఇక్కడ పంజాబ్ కి మంచి రికార్డ్ ఉంది.ఈ పిచ్ బ్యాట్స్ మెన్ లకు అనుకూలించనుంది.టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.

3)రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

వరుస ఓటములు తరువాత ముంబై తో జరిగిన గత మ్యాచ్ లో గెలిచి మంచి ఉత్సాహం తో ఉంది రాజస్థాన్ జట్టు.ఆ జట్టు ఓపెనర్లు బట్లర్ , రహానే లు ఫామ్ లోకి రావడం తో పాటు జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం ఆ జట్టు కి అనుకులంశాలు.ఇకపోతే రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తుంది.మిడిల్ ఆర్డర్ పైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ( PROBABLE XI ) – అజింక్య రహానే , జాస్ బట్లర్ , సంజు శాంసన్ , రాహుల్ త్రిపాఠి , స్టీవ్ స్మిత్ , బెన్ స్టోక్స్ , జోఫ్రా ఆర్చర్ , గౌతమ్ , శ్రేయస్ గోపాల్ , ఉనత్కట్ , ధవాల్ కులకర్ణి

4)కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఎలా ఉండబోతుంది

పంజాబ్ జట్టు బెంగళూర్ తో ఆడిన మ్యాచ్ లో ఒడినప్పటికి ఆ జట్టు స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ 99 పరుగులు చేసి ఫామ్ ని అందుకున్నాడు.బౌలింగ్ పంజాబ్ జట్టుకు బలంగా కనిపిస్తుంది.రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ ని కట్టడి చేయగలిగితే పంజాబ్ కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచే ప్లే ఆఫ్స్ రేస్ లో ఒక అడుగు ముందుకు వేయాలని పంజాబ్ ఆలోచిస్తుంది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ( PROBABLE XI ) – క్రిస్ గేల్ , రాహుల్ , సర్ఫరాజ్ , మయాంక్ అగర్వాల్ , డేవిడ్ మిల్లర్ , శ్యామ్ కుర్రాన్ , అశ్విన్ , అక్షర్ పటేల్ , ముజీబ్ రెహ్మాన్ , షమీ , అంకిత్ రాజ్ పుత్