ఐపీఎల్ లో తొలి రోజు మ్యాచ్ చప్పగా సాగితే రెండో రోజు జరిగింది రెండు మ్యాచ్ లు అభిమానులకు పూర్తి వినోదాన్ని ఇచ్చింది .ఈ రోజు జరిగే నాలుగవ మ్యాచ్ లో పంజాబ్ తో రాజస్థాన్ తలపడబోతుంది.
ఈ రెండు జట్లు గతేడాది పేలవంగా ఆడాయి , పంజాబ్ 11 వ సీజన్ ఆరంభం లో పాయింట్ల పట్టిక లో దూసుకుపోయింది.కానీ రెండవ అర్ధ భాగం లో విఫలం అయి ప్లే ఆఫ్స్ కి కూడా చేరలేదు.
ఈ మ్యాచ్ రాజస్థాన్ తన సొంత గడ్డపైన ఆడబోతుండడం ఆ జట్టు కి కలిసొచ్చే అవకాశం.గతేడాది ఈ రెండు జట్ల మధ్య 2 మ్యాచ్ లు జరగగా చెరో విజయం సాధించాయి.
పిచ్ ఎలా ఉండబోతుంది
రాజస్థాన్ లో జరిగే ఈ మధ్య జైపూర్ స్టేడియం లో ఆడనుంది , ఇక్కడ పిచ్ స్పిన్నర్లకి అనుకూలిస్తుంది , బ్యాటింగ్ చేస్తున్న కొద్దీ పిచ్ పైన పరుగులు చేయడం కష్టం అవుతుంది , ఇక్కడ ఐపీఎల్ సగటు తొలి ఇన్నింగ్స్ పరుగులు 165.
ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య రికార్డ్ లు ఎలా ఉన్నాయి
రాజస్థాన్ రాయల్స్ , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య 17 మ్యాచ్ లు జరగగా 10 విజయాల తో రాజస్థాన్ జట్టు ముందుండగా , పంజాబ్ 6 విజయాలు సాధించి ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలా ఉండబోతుంది
రాజస్థాన్ జట్టు గతేడాది తో పోలిస్తే ఈ సీజన్ లో పటిష్టంగా కనిపిస్తుంది.గతేడాది నిషేధం కి గురి అయిన స్టీవ్ స్మిత్ నిషేధ గడువు ముగియడం తో జట్టులోకి రానున్నాడు.అతని రాక తో రాజస్థాన్ బ్యాటింగ్ బలపడనుంది.ఇక పోతే ఫామ్ లో ఉన్న బట్లర్ , ప్రపంచ అత్యున్నత అల్ రౌండర్ లు అయిన స్టోక్స్ , ఆర్చే లు రాణిస్తే రాజస్థాన్ ని పంజాబ్ అడ్డుకోవడం కష్టమే.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ( PROBABLE XI ) – అజింక్య రహానే , స్టీవ్ స్మిత్ , జొస్ బట్లర్ , సంజు శాంసన్, బెన్ స్టోక్స్ ,రాహుల్ త్రిపాఠి , జోఫ్రా ఆర్చే ,జయదేవ్ ఉనాధ్కట్ , వరుణ్ ఆరోన్ ,గౌతమ్ శ్రేయస్ గోపాల్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఎలా ఉండబోతుంది
గతేడాది పంజాబ్ మొదటి అర్ధభాగం లో గేల్ , రాహుల్ బ్యాటింగ్ ధాటికి వరుస విజయాలు సాధించింది.గేల్ , రాహుల్ టీ20 లలో ఫామ్ అందుకోవడం ,ఇటీవల కర్ణాటక కు ఆడిన కరుణ్ నాయర్ , మయంక్ అగర్వాల్ ఫామ్ లో ఉండటం పంజాబ్ బ్యాటింగ్ ని బలపరుస్తుంది.ఇకపోతే ఆండ్రి టై , షమీ , అశ్విన్ లతో బౌలింగ్ కూడా బాగుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ( PROBABLE XI ) – కె.ఎల్ .రాహుల్ , క్రిస్ గేల్ , మయంక్ అగర్వాల్ , కరుణ్ నాయర్ , మాన్ దీప్ సింగ్ , శ్యాం కుర్రాన్ , అశ్విన్ , టై , షమీ , వరుణ్ చక్రవర్తి , ముజీబ్ రెహ్మాన్
.