ఈ రోజు ఐపీఎల్ లో రాజస్థాన్ తో ఢిల్లీ మ్యాచ్.. ఏ జట్టుకు ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయో చూడండి..  

Rajasthan Royals Versus Delhi Capitals Match Prediction-ipl 40th Match T20,ipl Match Prediction,ipl Today Match,rajasthan Royals,ఢిల్లీ క్యాపిటల్స్,రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్ లో చాలా మ్యాచ్ లు చేజేతులా ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకున్నారు లేకుంటే ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితీ వేరుగా ఉండేది. 9 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ జట్టు 6 మ్యాచ్ లలో ఓడగా 3 మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది.ప్రస్తుతం ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతే. ఇకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యువకులు , అనుభవజ్ఞులు కలగలిపిన జట్టు. ప్రస్తుతం పాయింట్ ల పట్టికలో 6 విజయాలతో మూడవ స్థానం లో ఉన్న ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచే ప్లే ఆఫ్స్ రేస్ కోసం ఒకడుగు ముందుకు వేయాలనుకుంటుంది..

ఈ రోజు ఐపీఎల్ లో రాజస్థాన్ తో ఢిల్లీ మ్యాచ్.. ఏ జట్టుకు ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయో చూడండి..-Rajasthan Royals Versus Delhi Capitals Match Prediction

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఢిల్లీ , రాజస్థాన్ జట్లు ఇప్పటి వరకు 18 మ్యాచ్ లు ఆడగా ఢిల్లీ జట్టు 7 మ్యాచ్ లలో విజయం సాధించగా , రాజస్థాన్ రాయల్స్ జట్టు 11 మ్యాచ్ లలో గెలుపొందింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ రాజస్థాన్ లోని జైపూర్ లో జరగనుంది. ఇక్కడి పిచ్ స్పిన్నర్లకి అనుకూలించనుంది. ఈ పిచ్ పైన టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

3)ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ఢిల్లీ తన చివరి మ్యాచ్ లో పంజాబ్ పైన అన్ని విభాగాల్లో రాణించి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పాయింట్ ల పట్టికలో మూడవ స్థానం లో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ రేస్ లో ముందుకు దూసుకెళ్లాలని భావిస్తుంది. ఆ జట్టు బౌలర్లు రబడ , అక్షర్ పటేల్ , అమిత్ మిశ్రా లు ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేస్తున్నారు. రాజస్థాన్ మ్యాచ్ లో బౌలర్లు రాణిస్తే ఆ జట్టు కి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి.

బ్యాటింగ్ లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుండి నడిపిస్తున్నాడు. ఆ జట్టు యువ బ్యాట్స్ మెన్ ఓపెనర్ ప్రిథ్వీ షా భారీ ఇన్నింగ్స్ ఆడి చాలా మ్యాచ్ లు అయింది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ( PROBABLE XI ) – ప్రిథ్వీ షా , శిఖర్ ధావన్ , శ్రేయస్ అయ్యర్ , రిషబ్ పంత్ , కోలిన్ ఇంగ్రామ్ , రూథర్ ఫర్డ్ , కీమో పాల్ , అక్షర్ పటేల్ , రబడ , ఇషాంత్ శర్మ , అమిత్ మిశ్రా

4)రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు చేసుకుంది. సీజన్ ఆరంభం నుండి ఆ జట్టు విదేశీ ఆటగాళ్ళ పైనే ఎక్కువగా ఆధారపడుతూ వచ్చింది.

గత మ్యాచ్ లో కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన స్టీవ్ స్మిత్ అద్భుతమైన బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీ తో ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. ఇకపోతే బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ , గోపాల్ , కులకర్ణి లు అద్భుతంగా రాణిస్తున్నారు. బెన్ స్టోక్స్ , రహానే లాంటి స్టార్ ప్లేయర్లు రాణిస్తే ఢిల్లీ పైన గెలిచే అవకాశాలు ఉంటాయి.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ( PROBABLE XI ) – అజింక్య రహానే , జాస్ బట్లర్ , సంజు శాంసన్ , రాహుల్ త్రిపాఠి , స్టీవ్ స్మిత్ , బెన్ స్టోక్స్ , జోఫ్రా ఆర్చర్ , స్టువర్ట్ బిన్నీ , శ్రేయస్ గోపాల్ , ఉనత్కట్ , ధవాల్ కులకర్ణి