ఈ రోజు ఐపీఎల్ లో రాజస్థాన్ తో ఢిల్లీ మ్యాచ్.. ఏ జట్టుకు ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయో చూడండి..

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్ లో చాలా మ్యాచ్ లు చేజేతులా ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకున్నారు లేకుంటే ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితీ వేరుగా ఉండేది.9 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ జట్టు 6 మ్యాచ్ లలో ఓడగా 3 మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది.ప్రస్తుతం ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతే.ఇకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యువకులు , అనుభవజ్ఞులు కలగలిపిన జట్టు.ప్రస్తుతం పాయింట్ ల పట్టికలో 6 విజయాలతో మూడవ స్థానం లో ఉన్న ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచే ప్లే ఆఫ్స్ రేస్ కోసం ఒకడుగు ముందుకు వేయాలనుకుంటుంది.

 Rajasthan Royals Versus Delhi Capitals Match Prediction-TeluguStop.com

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఢిల్లీ , రాజస్థాన్ జట్లు ఇప్పటి వరకు 18 మ్యాచ్ లు ఆడగా ఢిల్లీ జట్టు 7 మ్యాచ్ లలో విజయం సాధించగా , రాజస్థాన్ రాయల్స్ జట్టు 11 మ్యాచ్ లలో గెలుపొందింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ రాజస్థాన్ లోని జైపూర్ లో జరగనుంది.ఇక్కడి పిచ్ స్పిన్నర్లకి అనుకూలించనుంది.ఈ పిచ్ పైన టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

3)ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ఢిల్లీ తన చివరి మ్యాచ్ లో పంజాబ్ పైన అన్ని విభాగాల్లో రాణించి విజయాన్ని అందుకుంది.ప్రస్తుతం పాయింట్ ల పట్టికలో మూడవ స్థానం లో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ రేస్ లో ముందుకు దూసుకెళ్లాలని భావిస్తుంది.ఆ జట్టు బౌలర్లు రబడ , అక్షర్ పటేల్ , అమిత్ మిశ్రా లు ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేస్తున్నారు.

రాజస్థాన్ మ్యాచ్ లో బౌలర్లు రాణిస్తే ఆ జట్టు కి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి.బ్యాటింగ్ లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుండి నడిపిస్తున్నాడు.ఆ జట్టు యువ బ్యాట్స్ మెన్ ఓపెనర్ ప్రిథ్వీ షా భారీ ఇన్నింగ్స్ ఆడి చాలా మ్యాచ్ లు అయింది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ( PROBABLE XI ) – ప్రిథ్వీ షా , శిఖర్ ధావన్ , శ్రేయస్ అయ్యర్ , రిషబ్ పంత్ , కోలిన్ ఇంగ్రామ్ , రూథర్ ఫర్డ్ , కీమో పాల్ , అక్షర్ పటేల్ , రబడ , ఇషాంత్ శర్మ , అమిత్ మిశ్రా

4)రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు చేసుకుంది.సీజన్ ఆరంభం నుండి ఆ జట్టు విదేశీ ఆటగాళ్ళ పైనే ఎక్కువగా ఆధారపడుతూ వచ్చింది.గత మ్యాచ్ లో కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన స్టీవ్ స్మిత్ అద్భుతమైన బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీ తో ఆ జట్టుకు విజయాన్ని అందించాడు.

ఇకపోతే బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ , గోపాల్ , కులకర్ణి లు అద్భుతంగా రాణిస్తున్నారు.బెన్ స్టోక్స్ , రహానే లాంటి స్టార్ ప్లేయర్లు రాణిస్తే ఢిల్లీ పైన గెలిచే అవకాశాలు ఉంటాయి.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ( PROBABLE XI ) – అజింక్య రహానే , జాస్ బట్లర్ , సంజు శాంసన్ , రాహుల్ త్రిపాఠి , స్టీవ్ స్మిత్ , బెన్ స్టోక్స్ , జోఫ్రా ఆర్చర్ , స్టువర్ట్ బిన్నీ , శ్రేయస్ గోపాల్ , ఉనత్కట్ , ధవాల్ కులకర్ణి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube