రాజస్థాన్ వేడికి వాడిపోతున్న కమలం.. మున్సిపల్ ఎన్నికల్లో ఎదురు దెబ్బ.. ??

మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో బీజేపీ హవా మరింతగా పెరింగిందని ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు భావిస్తున్నారట.అదీగాక రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం బీజేపీ అధికారంలోకి రావడానికి ఆ నేతలు తీవ్రమైన కృషి చేస్తున్నారు.

 Rajasthan Municipal Election, Rajasthan, Municipal, Election, Bjp, Congress-TeluguStop.com

తెలంగాణాలో అయితే బీజేపీ బండి ఆగమన్న ఆగడం లేదు.ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో రాజస్థాన్ లో మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.కాగా 20 జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 450 స్థానాల్లో దూసుకుపోతుంటే 402స్థానాల్లో బీజేపీ తన ఆధిక్యం కొనసాగిస్తుందట.

Telugu Congress, Rajasthan-Latest News - Telugu

అంటే రాజస్దాన్ వేడికి కమళం వాడిపోవడానికి సిద్దం అవుతుందా అనే అనుమానాలు ఈ ఫలితాలను చూసిన వారికి కలుగుతున్నాయట.ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 22.84 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించు కోగా, 30 వేల మంది ఇతర కారణాల వల్ల ఓటు హక్కును వినియోగించుకోలేదని రాజస్థాన్ ఎన్నికల సంఘం తెలిపింది.

ఈ ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల కౌంటింగ్ ఆదివారం కూడా కొనసాగుతుందట.అయితే 90 పంచాయతీ స్థానాల్లో 3,035 వార్డ్ లలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగగా, ఈ ఎన్నికల్లో 30.28 లక్షల మంది తమ ఓట్లను నమోదు చేసుకోగా అందులో 15.47 లక్షల మంది పురుషులు, 14.80 మంది మహిళలు ఉన్నారు.56 మంది ఇతర వర్గానికి చెందిన వారున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube