ఇదేం వింత వ్యాధి.. పడుకున్నాడంటే వందల రోజులు నిద్రలోనే!

ప్రపంచంలో ఉన్న చాలా మంది రకరకాల వింత వ్యాధులతో బాధపడుతుంటారు.కొందరు వైద్యం చేయించుకుంటే తగ్గే వ్యాధులు ఉంటే మరికొందరు వైద్యం చేయించుకున్నా… కూడా తగ్గని వ్యాధులు ఉంటాయి.

 Rajasthan Man Sleeps 300 Days A Year Due To This Rare Disorder, Rajasthan Man ,-TeluguStop.com

ఇలా వింత వ్యాధులతో బాధపడే వారి బాధలు అన్నీ ఇన్నీ కావు.ప్రశాంతంగా నిద్రించే వారు చాలా గొప్ప అదృష్టవంతులని చాలా మంది చెబుతారు.

అలా కొందరు పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు.ఇంకా కొంత మందికి గంటల కొద్దీ పడుకున్నా నిద్ర పట్టక సతమతమవుతుంటారు.

ఇలా రాజస్థాన్​ కు చెందిన వ్యక్తి ఒకతను ఏకంగా ఏడాదిలో 300 రోజుల పాటు నిద్ర పోతాడు.ఈ విషయం విన్న వాళ్లందరూ షాక్​ కు లోనవుతూ నిజమా ఇది అని ఆశ్చర్యపోతున్నారు.

అసలు ఏడాదిలో 300 రోజులపాటు నిద్రించే ఆ వ్యక్తి కథేంటో ఇప్పుడు చూద్దాం.


రాజస్థాన్ రాష్ర్టంలోని నాగౌర్ జిల్లా భద్వా గ్రామానికి చెందిన 42 సంవత్సరాల పూర్ఖారామ్ అనే వ్యక్తి ఎవరూ ఇంత వరకు వినని అరుదైన వ్యాధితో సహవాసం చేస్తున్నాడు.

పూర్ఖారామ్​ మరీ భీభత్సంగా సంవత్సరంలో 300 రోజుల పాటు నిద్రలోనే ఉంటాడట.వినేందుకే వింతగా ఉన్నా… ఇది నిజం.ఇలా పూర్ఖారామ్​ ఒకసారి నిద్రపోతే దాదాపు 25 రోజుల పాటు లేవకుండా పడుకుంటాడు.పూర్ఖారామ్​ గడిచిన 23 ఏళ్లుగా ఈ వింత వ్యాధితో బాధపడుతూనే ఉన్నాడు.

 ఈ వ్యాధి మొదటి దశలో ఉన్నపుడు పూర్ఖారామ్​ కేవలం వారం రోజులు నిద్రపోయే వాడట.ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాని కుటుంబీకులు అతడిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందట.

వైద్య పరిభాషలో ఈ వింత వ్యాధిని హైపర్సోమ్నియాగా అభివర్ణిస్తారు.ఈ వ్యాధితో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు పూర్ఖారాం భార్య లిచ్మీ దేవి వాపోయారు.కొన్ని సంవత్సరాలుగా అతడిలో ఈ వ్యాధి పెరుగతూ వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube