ప్రియురాలు ఇంటి నుంచి 'పాకిస్థాన్'కు.. ఎలా అంటే?

తాను ప్రేమించిన అమ్మాయిని కలవడానికి వెళ్లిన ఓ యువకుడు ప్రేయసి ఇంటి నుంచి తప్పించుకొని వచ్చే క్రమంలో దారితప్పి పొరపాటున సరిహద్దు దాటి పాకిస్థాన్ లోకి ఎంటర్ అయ్యాడు.దీంతో పాకిస్తాన్ పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

 Rajasthan Man Meghaval Mistakenly Enters Pakistan While Returning From Girlfrien-TeluguStop.com

దీంతో సదరు యువకుడు తల్లిదండ్రులు పాకిస్తాన్ పోలీసుల నుంచి తమ కొడుకును విడిపించాలని జిల్లా అధికారులను ఆశ్రయించారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

రాజస్థాన్ కి చెందిన గెమ్రా రామ్‌ మేఘ్‌వల్‌(19) అనే యువకుడు భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో గల కుంహారోకా టిబ్బా ప్రాంతంలో నివసిస్తున్నాడు.

ఈ యువకుడు గత సంవత్సరం నవంబర్ నెలలో తన ప్రియురాలిని కలవడానికి తన ఇంటికి వెళ్ళాడు.అయితే తన ప్రియురాలి కుటుంబ సభ్యులు తనని చూడటంతో ఇంటి నుంచి తప్పించుకొని వస్తున్న సమయంలో ఆ యువకుడు దారి తప్పి పొరపాటున పాకిస్తాన్ లోకి వెళ్ళాడు.

పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించిన ఆ యువకుడిని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేసి ఈ విషయాన్ని రాజస్థాన్ పోలీసులకు తెలియజేశారు.

Telugu Friend, India, Pakistan, Rajastan, Rajasthan, Returns-Latest News - Telug

గత ఏడాది నవంబర్ నెలలో మేఘ్‌వల్‌ కనిపించడం లేదంటూ తన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే తన కొడుకు ప్రస్తుతం పాకిస్తాన్ పోలీసుల కస్టడీలో ఉన్నాడని తెలియగానే అతని తల్లిదండ్రులు తమ కొడుకును ఎలాంటి చిత్రహింసలకు గురి చేస్తున్నారోనని భావించి తొందరగా తమ కొడుకును భారత్ కి రప్పించాలని తాజాగా బిజెపి నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ ని సంప్రదించారు.అయితే ఈ కేసుకు సంబంధించి ఓ బీఎస్‌ఎఫ్‌ అధికారి పాకిస్తాన్ రేంజర్లతో అనేక సార్లు సమావేశాలు జరిగిన తర్వాత మేఘ్‌వల్‌ సింధ్‌ పోలీసుల కస్టడీలోనే ఉన్నట్లు తెలిపారు.

ఇక్కడ అతనికి చట్టపరమైన చర్యలు పూర్తయిన తరువాత అతనిని క్షేమంగా భారత్ కి పంపిస్తామని పాకిస్థాన్ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.అయితే అతను పాకిస్థాన్ లోకి ఏవిధంగా ప్రవేశించాడు అనే విషయం మాత్రం మేఘ్‌వల్‌ సింధ్‌ భారత్ కి వచ్చిన తరువాతే తెలుస్తుందని పోలీసులు భావించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube