మగపిల్లాడి కోసం ఏకంగా 12 మందిని కనింది  

Rajasthan Lady Gives Birth To Son After 11 Daughters-rajasthan Governament,rajasthan Lady,rajasthan Women,women Give The Birth 12 Daughters

ఆడ పిల్ల, మగ పిల్లాడు అన్న తేడాలు ఇంకా ఈ రోజుల్లో కూడా ఉన్నాయి అంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది.కేవలం మగపిల్లాడి ని కనాలి అన్న ఉద్దేశ్యం తో ఇప్పటికే 11 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చింది.

Rajasthan Lady Gives Birth To Son After 11 Daughters-rajasthan Governament,rajasthan Lady,rajasthan Women,women Give The Birth 12 Daughters Telugu Viral News-Rajasthan Lady Gives Birth To Son After 11 Daughters-Rajasthan Governament Rajasthan Women Give The 12 Daughters

రాజస్థాన్ కు చెందిన ఒక మహిళ పేరు గుద్ది.ఆమె మగపిల్లాడిని కనాలి అన్న కారణంగా ఏకంగా 12 మంది బిడ్డలకు జన్మినిచ్చింది.

మొత్తానికి చివరి బిడ్డగా నవంబర్ 20 న మగబిడ్డ కు జన్మనివ్వడం తో ఆమె ఆరాటం తీరిపోయింది.గుడ్డి ఎంత మంది ఆడ పిల్లల్ని కన్నా ఆమెకు మగ బిడ్డ పుట్టట్లేదనీ, ఆమెలో ఏదో లోపం ఉందనీ స్థానికులు, చుట్టుపక్కల వాళ్లు, ఊరి పెద్దలూ అందరూ రకరకాలుగా సూటి పోటీ మాటలు మాట్లాడడం తో ఆమె, ఆమె భర్త కూడా భరించలేకపోయేవారు.

ఈ క్రమంలో ఆమె మగబిడ్డకు జన్మనివ్వాలని నిశ్చయించుకొని ఏకంగా 11 మంది ఆడపిల్లను కనింది.చివరిగా 12 వ బిడ్డగా ఈ నెల 20 న మగబిడ్డకు జన్మనివ్వడం తో దేవుడు దయ తలిచాడు అంటూ ఆ కుటుంబం ఆనంద పడుతుంది.

ఇప్పటివరకు ఆమె జన్మనిచ్చిన బిడ్డల్లో ముగ్గురికి పెళ్లిళ్లు కూడా జరిగిపోయాయి.ప్రస్తుతం ఆమె వయసు 42 ఏళ్ళు కాగా, పెద్ద కుమార్తె వయసు 22 ఏళ్లు గా తెలుస్తుంది.

మగపిల్లాడు పుట్టాలి అని ఇన్ని సంవత్సరాలుగా గుడ్డి నరకయాతన పడింది.చివరికి పండంటి మగబిడ్డ పుట్టడం తో ఆమె ఎదురు చూపులు ముగిశాయి.

ఈ తరం లో ఇలాంటి వారు ఉంటారు అంటే మాత్రం చాలా ఆశ్చర్యం కలుగుతుంది.మొత్తానికి దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి అంటే అక్కడ ప్రభుత్వం ఎలాంటి పాలన సాగిస్తుందో అన్న విషయం మాత్రం అర్ధం కావడం లేదు.

తాజా వార్తలు