వారి వేటుపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అంటూ పేర్కొన్న కోర్టు!

కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ విషయంలో హైకోర్టు తీర్పు వెల్లడించింది.ఇటీవల పార్టీ నియమ నిబంధనలు ఉల్లఘించారు అంటూ సచిన్ తో పాటు ఆయనకు మద్దతుగా నిలిచిన 18 మంది ఎమ్మెల్యేలు అందరిపై కూడా వేటు వేస్తూ రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

 Rajasthan Hc Tells Speaker Not To Act Against Sachin Pilot And Rebel Mlas Till J-TeluguStop.com

గత కొంత కాలంగా రాజస్థాన్ రాజకీయాల్లో చోటుచేసుకున్న సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సచిన్, ఆయన వర్గం ప్రవర్తిస్తున్న తీరుకు వారిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.

దీనితో రాజస్థాన్ డిప్యూటీ సీఎం పదవి అలానే పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పదవి నుంచి సైతం సచిన్ ను తొలగిస్తున్నట్లు కీలక ఆదేశాలు జారీ చేశారు.అయితే తనతో పాటు తనకు మద్దతు ఇస్తున్న 18 మంది ఎమ్మెల్యేలపై కూడా వేటు వేయడం తో హైకోర్టు లో పిటీషన్ కూడా దాఖలు చేశారు.

అయితే ఈ పిటీషన్ పై విచారించిన హైకోర్టు సచిన్ కు భారీ ఊరట నిచ్చింది.ఎమ్మెల్యేల అనర్హత పై జూలై 24 వరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోవద్దని స్పీకర్ సీపీ జోషిని ఆదేశించింది.

పైలట్ తరపున న్యాయవాది ముకుల్ రోహద్గీ వాదిస్తూ… పైలట్‌తో పాటు మరో 18 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ జోషి అత్యుత్సాహం ప్రదర్శించి నిర్ణయం తీసుకున్నారు అంటూ కోర్టులో వాదించారు.అంతేకాకుండా పైలట్‌తో పాటు మరో 18 మందికి నోటీసులు జారీ చేసే సమయంలో ఎలాంటి కారణం కూడా చూపకుండా నోటీసులు జారీ చేసినట్లు ఆయన ఆరోపించారు.

ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి వాటిపై స్పందనకు కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఇచ్చారని కోర్టుకు వెల్లడించారు.దీనితో వాదనలు విన్న కోర్టు ఈ నెల 24 వ తేదీ వరకు వారి అనర్హత పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అంటూ కోర్టు ఆదేశించినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube