పైలట్ పిటీషన్ కు 'సై' అన్న హైకోర్టు,కేంద్రం ను కూడా...

రాజస్థాన్ రాజకీయాల్లో రోజు రోజుకు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.సచిన్ పైలట్ దాఖలు చేసిన పిటీషన్ పై రాజస్థాన్ హైకోర్టు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది.

 Rajasthan Political Crisis, Sachin Pilot, 18 Rebel Congress Mlas, Disqualificati-TeluguStop.com

గతంలో దీనిపై విచారించిన కోర్టు ఈ రోజు(అనగా 24 వ తేదీ)వరకు వారి అనర్హత ఆదేశాలను నిలిపివేయాలి అంటూ వెల్లడించిన విషయం తెలిసిందే.అయితే ఈ రోజు తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు సచిన్ పైలట్ తో పాటు బృందం దాఖలు చేసిన పిటీషన్ ను స్వీకరిస్తూ నిర్ణయం తీసుకుంది.

అంతేకాకుండా దీనిలో కేంద్రం ను కూడా ప్రతివాదిగా చేర్చినట్లు తెలుస్తుంది.పైలట్ తో పాటు 19 మంది ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వేయడం తో వారంతా హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ పిటీషన్ పై విచారణ నిలిపివేయాలి అంటూ స్పీకర్ సీపీ జోషి సుప్రీం కోర్టు లో దాఖలు చేసిన పిటీషన్ తోసిపుచ్చడం తో ఈ రోజు యధావిధిగా హైకోర్టు లో పైలట్ పిటీషన్ విచారణ ప్రారంభమైంది.కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చిన కోర్టు 15 నిమిషాల బ్రేక్ తరువాత తిరిగి విచారణ ప్రారంభించింది.

పైలట్ పిటీషన్ కు సంబంధించి రాజ్యాంగంలోని 10 వ అధికరణం ప్రస్తావన రావడం తో కేంద్రం ను ప్రతివాదిగా చేర్చింది కోర్టు.ఎందుకంటే రాజ్యాంగానికి సంబంధించి ఏ ప్రస్తావన వచ్చినా దానికి కేంద్రం తో సంబంధం ఉంటుంది కాబట్టి కేంద్రాన్ని ఈ పిటీషన్ కు సంబంధించి హైకోర్టు ప్రతివాదిగా చేర్చింది.

అయితే ఇప్పుడు కేంద్రం ఎలాంటి వాదనలు వినిపిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.పార్టీ కి వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం పైలట్ తో పాటు ఆయన వర్గం వ్యవహరించింది అంటూ పైలట్ నిర్వర్తిస్తున్న బాధ్యతల నుంచి తొలగిస్తూ రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.

Telugu Rebelcongress, Rajasthan Hc, Rajasthan, Pilot-Political

పైలట్ తో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయడం తో రాజస్థాన్ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు.ఎలాంటి కారణం లేకుండా తమపై వేటు వేశారని, ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి అంటూ పైలట్ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు.దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేంద్రం ను కూడా ప్రతివాదిగా చేర్చడం తో ఇప్పుడు ఈ అంశం ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube