గవర్నర్ లవ్ లెటర్,పీఎం కు వివరించిన సీఎం!

గవర్నర్ లవ్ లెటర్ ఏంటి, సీఎం నుంచి పీఎం వరకు ఈ విషయం వెళ్లడం ఏంటి అని అనుకుంటున్నారా.రాజస్థాన్ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఒక్కోరోజు ఒక్కో మలుపు తిరుగుతున్నాయి.

 Governor Sent Love Letter Says Rajasthan Cm Ashok Gehlot, Rajasthan, Governor, K-TeluguStop.com

ఇప్పటికీ బీఎస్పీ అధినేత్రి తమ పార్టీ కి చెందిన 6 గురు ఎమ్మెల్యేలు గెహ్లాట్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలి అంటూ విప్ లను జారీ చేసి కాంగ్రెస్ కు ఝలక్ ఇవ్వగా, తాజాగా గవర్నర్ నుంచి కూడా గెహ్లాట్ కు చుక్కెదురైంది.బలనిరూపణ కోసం అసెంబ్లీ ని సమావేశపరచాలి అంటూ రాజస్థాన్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రా ను సీఎం అశోక్ గెహ్లాట్ అభ్యర్ధించగా దానికి గవర్నర్ తిరస్కరిస్తూ తిరిగి లేఖను పంపారు.

దీనితో గవర్నర్ తీరుపై గెహ్లాట్ మండిపడుతున్నారు.గత నాలుగు రోజులుగా బలపరీక్ష కోసం అసెంబ్లీ ని సమావేశపరచాలి అంటూ అభ్యర్థిస్తుండగా తాజాగా గవర్నర్ స్పందిస్తూ తిరుగు లేఖ రాయడం చర్చనీయాంశమైంది.ఒక ముఖ్యమంత్రి శాసనసభ ను సమావేశపరచాలి అని కోరితే ఇలా తిరస్కరించడం దారుణమని అన్నారు.70 ఏళ్ల చరిత్రలో ఇలా ఒక ముఖ్యమంత్రి అభ్యర్ధనను గవర్నర్ తిరస్కరించడం ఇదే తొలిసారి అంటూ గెహ్లాట్ అభిప్రాయపడ్డారు.అలానే నాకు గవర్నర్ ఆరు పేజీల లవ్ లెటర్ పంపారు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం రాజస్థాన్ చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పీఎం ప్రధాని మోడీ కి కూడా ఫోన్ ద్వారా గెహ్లాట్ వివరించినట్లు తెలుస్తుంది.

రాజస్థాన్ లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం తో పాటు గవర్నర్ తీరుపై కూడా మోడీకి వివరించినట్లు తెలుస్తుంది.మరి దీనిపై పీఎం ఎలా స్పందిస్తారు అన్నది చర్చనీయాంశమైంది.

ఇప్పటికే రాజస్థాన్ లో చోటుచేసుకున్న పరిణామాలకు బీజేపీ నే కారణం అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్న విషయం విదితమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube