ఆ రాష్ట్రంలో బాల్య వివాహాలు చేసుకోవడాన్ని చట్టబద్ధం చేసిన ప్రభుత్వం.. !

బాల్య వివాహాలు చేయడం, బాల్య వివాహాలు జరిపించడం అనేది చట్టరీత్యా నేరం అనే విషయం మన అందరికి తెలిసిందే.నేరం అని తెలిసినగాని ఎక్కడో ఒకచోట బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.

 Rajasthan Government Passed The Bill Which Makes Child Marriage Legal, Child Mar-TeluguStop.com

అమ్మాయి అబ్బాయి మైనర్ అయితే వాళ్ళకి పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం.పెళ్లి చేసుకోబోయే వాళ్ళు తప్పనిసరి మేజర్లు అయితేనే ఆ పెళ్లి చెల్లుతుంది.

కానీ ఇప్పుడు బాల్య వివాహాలను ఎటువంటి భయం లేకుండా జరిపించుకోవచ్చని రాజస్థాన్ ప్రభుత్వం అంటుంది.ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వం బాల్య వివాహాలను చట్టబద్ధం చేసింది.

రాజస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ నేతలు తీసుకున్న నిర్ణయం సరికాదని భిన్న వాదన వినిపిస్తున్నారు.

తెలిసి తెలియని వయసులో పెళ్లి చేయడం అనేది తప్పు అని అందుకే బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.కానీ రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాల్య వివాహాలకు చట్టబద్ధతను కల్పిస్తూ పిల్లలకు చేసే పెళ్లిళ్లను నమోదు చేసేలాగా రాజస్థాన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ 2021 సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.2009లో గల బిల్లును సవరణ చేస్తూ ఆ బిల్లును తాజాగా 2021 బిల్లుగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టగా ఆ బిల్లును కాస్త పాస్ అవ్వడం జరిగింది.ఈ సవరణ బిల్లు ప్రకారం ఒకవేళ మైనర్లకు పెళ్లి చేస్తే నెలలోపు వారి తల్లితండ్రులు వారి వివరాలు తెలియచేసి ఆ బాల్య వివాహాన్ని నమోదు చేయాలన్నమాట.ఈ బిల్లుపై బీజేపీ సహా ఆ రాష్ట్ర విపక్షాలు ఆగ్రహంతో సభ నుండి వెళ్లిపోయారు.

అలాగే ఈ బిల్లు పాసైన ఈ రోజును బ్లాక్ డే గా అభివర్ణించాము అంటూ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ లహోటీ చెప్పుకొచ్చారు.

Telugu Child, Latest, Rajashtanshanti, Rajasthan, Rajesthan-Latest News - Telugu

కాగా ఈ బిల్లుపై రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధరివాల్ ఈ విధంగా స్పందించారు.”బాల్య వివాహాలకు చట్టబద్ధత ఇస్తున్నట్లు బిల్లుల ఎక్కడా లేదు.అయితే ఎవరికన్నా వివాహం జరిగినా తర్వాత రిజిస్ట్రేషన్ మాత్రం తప్పనిసరి అని మాత్రమే బిల్లు చెబుతోందనీ భిన్న వాదన వినిపిస్తున్నారు.

భర్త చనిపోయిన సందర్భాల్లో ఆ వితంతు మహిళలకు ప్రభుత్వ పధకాలు పొందాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి అవటంతో పెళ్లి తరువాత ఆ పెళ్లిని రిజిస్టర్ చేయించుకోవడం తప్పనిసరి చేశామని మంత్రి చెప్పుకొచ్చారు.కానీ విపక్షాలు మాత్రం ఈ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెళ్ళికి వయసుతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ ఏంటని ప్రశ్నిస్తున్నారు.

బిల్లుని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.కానీ., ప్రభుత్వం మాత్రం బిల్లు ఉద్ధేశం అది కాదని చెప్పుకొస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube