వెరైటీ వంటకం: కరోనా పకోడీ కర్రీ, మాస్క్ నాన్..!  

Corona Curries Prepare In Rajasthan Restaurents, Rajasthan, Coronavirus, Curries, Fathers Day, Mothers Day, Covid Special Curries - Telugu Coronavirus, Covid Special Curries, Curries, Fathers Day, Mothers Day, Rajasthan

వ్యాపారం బాగుండాలి అంటే కొత్త కొత్తగా ఆలోచించాలి.అప్పుడే వ్యాపారాల పరంగా లాభం పొందగలుగుతాం.

 Rajasthan Coronavirus Curries Fathers Day Mothers Day Covid Special

అందుకే ఏ స్పెషల్ డే వచ్చిన దానికి తగ్గట్టు వ్యాపారాలు చేసేస్తుంటారు.వాలంటైన్స్ డే, ఫ్రెండ్‌షిప్ డే, మథర్స్ డే, ఫాదర్స్ డే అని మాత్రమే కాకుండా ప్రస్తుతం అందరిని వణికించే కరోనా సీజన్ ని కూడా వాడేసుకుంటున్నారు వ్యాపారాలు.

కరోనా సీజన్ లో శానిటైజర్లు, మాస్కులు, ఫేస్‌షీల్డులు అమ్మడం పెద్ద విశేషమేమీ కాదు.కానీ కరోనా రూపంలో వంటకాలను అమ్మడమే స్పెషలిటీ.కొద్దీ రోజుల క్రితం ఓ బేకరీలో కరోనా రూపంలో స్వీట్లు తయారు చేసి విక్రయించారు.అది ఎలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వెరైటీ వంటకం: కరోనా పకోడీ కర్రీ, మాస్క్ నాన్..-Latest News-Telugu Tollywood Photo Image

ఇప్పుడు కూడా అలానే ఓ రెస్టారెంట్ చేసిన వంటకాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాజస్థాన్‌లో జోద్‌పూర్‌లోని ఓ రెస్టారెంటులో ఏకంగా కోవిడ్ స్పెషల్ కర్రీలు తయారు చేసి అమ్ముతున్నారు.

మలాయ్ కోఫ్తాలను కరోనా రూపంలో మలిచి కర్రీలుగా వడ్డిస్తున్నారు.నాన్, చపాతీలను మాస్కుల రూపంలో తయారు చేస్తున్నారు.

ఈ వంటకాలను తినేందుకు ఆహారప్రియులు కూడా ఇష్టపడుతున్నారు.

ఈ విషయంపై రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు, పరిశుభ్రతగా ఉంటున్నట్టు, శానిటైజెషన్ ద్వారా వైరస్ సమస్య లేకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలిపారు.

టచ్‌లెస్ మెనూ అందుబాటులోకి తెచ్చినట్టు భౌతిక దూరాన్ని పాటిస్తున్నట్టు అయన తెలిపారు.ప్రస్తుతం వీరి వంటకాలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#Mothers Day #Rajasthan #Curries #Fathers Day #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajasthan Coronavirus Curries Fathers Day Mothers Day Covid Special Related Telugu News,Photos/Pics,Images..