బలపరీక్ష కు సిద్దమౌతున్న గెహ్లాట్ వర్గం!

రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే.డిప్యూటీ సీఎం సచిన్ పైలట్,సీఎం అశోక్ గెహ్లాట్ ల మధ్య విభేదాలు తలెత్తడం తో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది.

 Rajasthan Cm Gehlat Ready To Face Floor Test In Next Week, Rajasthan Governament-TeluguStop.com

ప్రభుత్వం కలిసి పనిచేయడానికి నిరాకరించడం తో సచిన్ పైలట్ పై అధిష్టానం చర్యలు కూడా తీసుకుంది.ఆయనను డిసిప్లీనరీ యాక్షన్ కింద డిప్యూటీ సీఎం పదవి నుంచి అలానే పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగిస్తూ స్పీకర్ చేత ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

అయితే మరోపక్క అక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం సీఎం గెహ్లాట్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం గవర్నర్ కల్ రాజ్ మిశ్రా తో గెహ్లాట్ సమావేశమై బలపరీక్షకు తన సంసిద్ధతను వెల్లడించినట్లు సమాచారం.

పార్టీ నుంచి దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు సచిన్ కు మద్దతు ఇవ్వగా మిగిలిన వారు గెహ్లాట్ కు మద్దతుగా ఉన్నారు.అయితే మొత్తం 103 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందంటూ గెహ్లాట్ ప్రకటించినప్పటికీ ఇటీవల జరిగిన సిఎల్ఫీ సమావేశానికి మాత్రం 97 మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తుంది.

అయితే తాజాగా ఇద్దరు ప్రాంతీయ పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు కూడా గెహ్లాట్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం తో గవర్నర్ ను కలిసి బలపరీక్షకు సిద్ధమంటూ పేర్కొన్నారు.

వచ్ఛేవారం శాసన సభను సమావేశపరచాలని గవర్నర్ ను కోరగా, అయితే మంగళవారం తరువాతే సభ సమావేశం కావచ్ఛునని అంటున్నారు.

మరోపక్క తనను, తన వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేలను సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించడం తో స్పీకర్ పంపిన నోటీసును సవాలు చేస్తూ సచిన్ పైలట్ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.దీనిపై ఇంకా విచారణ జరగాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube