రాజస్థాన్ లో మరోసారి వేడెక్కిన రాజకీయం.. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ పీఠం నిలబడేనా...?

రాజస్థాన్ రాష్ట్రంలో గత కొద్ది కాలం క్రితం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరియు సొంత గూటికి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యే సచిన్ పైలెట్ ల మధ్య అధికార దాహ వివాదం జరిగింది.అది కాస్త చినికి.

 Gehlot Vs Pilot Again? Rajasthan Politics, Congress Party, Sachin Pilot, Ashok-TeluguStop.com

చినికి గాలి వానలా మారి దాదాపు ప్రభుత్వ పతనానికి చివరి అంచుల వరకు వెళ్ళింది.అయితే కాంగ్రెస్ అధిష్టానం కలుగజేసుకొని రాహుల్ మరియు ప్రియాంక చొరవతో ఆ వివాదం కాస్త సద్దుమణిగి పరిస్థితులు చక్కబడ్డాయి.

ఆ సమయంలో క్యాంపు రాజకీయాలు బాగా నడిచాయి.ఈ క్యాంపు రాజకీయాల విషయంలో రాజస్థాన్లో మళ్లీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరియు పైలెట్ ల మధ్య యుద్ధం మొదలైంది.

అప్పుడు జరిగిన క్యాంప్ రాజకీయాల్లో అశోక్ గెహ్లాట్ తన గ్రూప్ ఎమ్మెల్యేలను జైసల్మేర్ లో బస చేయించారు.ఆ సమయంలో అశోక్ గెహ్లాట్ క్యాంపు లోని ఎమ్మెల్యేల ఫోన్లను, యువనేత సచిన్ పైలెట్ యొక్క మీడియా మేనేజర్ లోకేంద్ర సింగ్ ట్యాప్ చేశారని, లోకేంద్ర సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ వ్యవహారంలో లోకేంద్ర సింగ్ ను పోలీసులు కొన్ని గంటల పాటు విచారించారు.ఈ నేపథ్యంలో సచిన్ పైలెట్ మరియు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మధ్య మళ్లీ పోరు ప్రారంభం అయ్యిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈసారి ఈ విషయం ఎక్కడిదాకా వెళుతుందో, ఈ పోరు పెద్దదైతే అసలు రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అవుతుందేమోనని చర్చనీయాంశమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube