ముదురుతున్న సంక్షోభం,సీఎం ను హెచ్చరించిన బీఎస్పీ అధినేత్రి!

ఒకపక్క సొంత పార్టీ సభ్యుల వ్యతిరేకతతో సతమతమౌతున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు బీఎస్పీ అధినేత్రి తీరు మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది.మొన్నటికి మొన్న తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలకు విప్ లు జారీ చేసిన మాయావతి ఇప్పుడు తాజాగా సీఎం గెహ్లాట్ కు గట్టి గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు.

 Mayawathi Says Will Teach A Lesson To Gehlot, Rajasthan, Ashok Gehlot, Bsp, Maya-TeluguStop.com

గత ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసి గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలను గతేడాది కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ లో చేర్చుకుంది.ఈ నేపథ్యంలో సరిగ్గా అక్కడ సంక్షోభం తలెత్తిన సమయంలో ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయినంత మాత్రాన వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయిపోరని,వారంతా కూడా అసెంబ్లీ లో గెహ్లాట్ ఫ్లోర్ టెస్ట్ సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయాలి అంటూ విప్ జారీ చేసింది.

ఇప్పుడు ఈ అంశం పై సుప్రీం కోర్టు కాకపోతే మరెక్కడికైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని,సీఎం గెహ్లాట్ కు గట్టి గుణపాఠం చెబుతామంటూ ఆమె హెచ్చరించారు.200 మంది సభ్యులున్న రాజస్తాన్ అసెంబ్లీలో మెజారిటీ మార్కు 101 కన్నా కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే మద్దతు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.గెహ్లాట్, తన ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి.తనకు సపోర్ట్ ఇస్తున్న సభ్యుల సంఖ్యను పెంచుకునేందుకు రాజస్థాన్ బహుజన్ సమాజ్ పార్టీని కాంగ్రెస్ లో విలీనమయ్యేలా చూశారు.ఈ వ్యవహారమంతా గత సెప్టెంబరులో జరిగింది.బీఎస్పీకి చెందిన ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు తమను కాంగ్రెస్ లో విలీనమైనవారిగా ప్రకటించుకున్నారు.

దీనితో రాజస్థాన్ రాజకీయాల్లో తమ పార్టీ అస్థిరత కు గురయ్యే ప్రమాదం ఉందంటూ భావించిన మాయావతి సరిగ్గా సమయం చూసి గెహ్లాట్ వర్గానికి ఝలక్ ఇవ్వడానికి సిద్దమైంది.అయితే గతంలోనే ఈ అంశం పై కోర్టు ను ఆశ్రయించవచ్చు కానీ, మంచి సమయం కోసం చూస్తున్నామని అయితే ఇంతకంటే మంచి సమయం ఇక ఉండబోదు అంటూ ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube