పెళ్లికి వచ్చిన 15మంది కరోనా పాజిటివ్.. వరుడు కుటుంబానికి రూ. 6 లక్షలు జరిమానా!  

Rajasthan 6 Lakhs Fine To Groom Family - Telugu 6 Lakhs Fine To Groom Family, Bhilwara, Corona, Marriage, Rajasthan Collector, Rajendra Bhatt

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా పీడిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి ఈ కరోనా సమయంలో కొన్ని నిబంధనల మధ్య పెళ్లిళ్లు జరుగుతున్నాయి.

 Rajasthan 6 Lakhs Fine To Groom Family

ఇంకా అలాంటి ఈ సమయంలో నిబంధనలతో పెళ్లి చేసుకోవడమే డేంజర్.అలాంటిది నిబంధనలు ఉల్లఘించి పెళ్లి చేసుకోవడం ఇంకా ఎంత డేంజర్ ఓ మీరే ఊహించుకోండి.

ఇంకా అలాంటిది 50 మందితో సైలెంట్ గా పెళ్లి చేసుకోండి అని చెప్తే.ఏకంగా వందలమంది అతిథుల మధ్య పెళ్లి చేసుకున్నారు.దానికి ఫలితమే 15 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.ఇంకా ఈ ఘటన రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో జరిగిందీ.

పెళ్లికి వచ్చిన 15మంది కరోనా పాజిటివ్.. వరుడు కుటుంబానికి రూ. 6 లక్షలు జరిమానా-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ నెల 13న గీసులాల్ రాఠీ అనే వ్యక్తి తన కుమారుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు.

ఆ వివాహానికి హాజరైన 15మందికి కరోనా పాజిటివ్ రావడమే కాకుండా ఒకరు మరణించారు కూడా.

ఇంకా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఈ నెల 22న గీసులాల్‌పై కేసు నమోదు చేశారు.ఇంకా కరోనా సోకినా 15 మందిని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందించారు.అయితే వారికీ పరీక్షల నిర్వహణ, చికిత్స, ఆహారం తదితర కలిపి రూ.6,26,600 అయింది.దీంతో ఈ మొత్తాన్ని గీసులాల్ కుటుంబం నుంచి వసూలు చేసి మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధిలో డిపాజిట్ చేయాలని సూచించారు కలెక్టర్ రాజేంద్ర భట్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajasthan 6 Lakhs Fine To Groom Family Related Telugu News,Photos/Pics,Images..

footer-test