శేఖర్ సినిమా తర్వాత రాజశేఖర్ కీలక నిర్ణయం తీసుకుంటాడట!

రాజశేఖర్‌ హీరోగా శేఖర్‌ సినిమా రూపొందిన విషయం తెల్సిందే.ఈ వారంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 Rajashekhar Movie Shekhar Releasing This Week Rajashekhar, Shekhar Movie , Tollywood, Shivani , Jeevitha Rajashekar ,-TeluguStop.com

భారీ ఎత్తున అంచనాలున్న శేఖర్‌ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు యాక్టివ్‌ గా చేస్తున్నారు.గతంలో రాజశేఖర్‌ నటించిన సినిమాల తో పోల్చితే ఈ సినిమా విషయంలో పాజిటివ్‌ బజ్‌ చాలా ఉంది.

అందుకు కారణం ఈ సినిమా లో హీరోగా రాజశేఖర్ చాలా విభిన్నమైన గెటప్ లో కనిపిస్తున్నాడు.అంతే కాకుండా ఈ సినిమా కు జీవిత దర్శకత్వం వహించడం జరిగింది.

 Rajashekhar Movie Shekhar Releasing This Week Rajashekhar, Shekhar Movie , Tollywood, Shivani , Jeevitha Rajashekar , -శేఖర్ సినిమా తర్వాత రాజశేఖర్ కీలక నిర్ణయం తీసుకుంటాడట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటీ అంటే ఈ సినిమా లో జీవిత రాజశేఖర్ ల పెద్ద కుమార్తె శివాని కీలక పాత్రలో కనిపించబోతుంది.ఇక చిన్న కూతురు శివాత్మిక కూడా ఈ సినిమా లో భాగస్వామ్యం గా ఉంది.

ఆమె ఒక నిర్మాతగా పని చేస్తుంది.అంటే సినిమా కోసం మొత్తం ప్యామిలీ అంతా కష్టపడ్డారు.

అనూప్‌ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

సినిమా సక్సెస్‌ అయితే హీరోగా రాజశేఖర్‌ కెరీర్ ను కొనసాగిస్తాడట.

కాని సినిమా ప్లాప్ అయితే ఖచ్చితంగా సినిమాల్లో కంటిన్యూ అవుతాడు కాని క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్‌ గా నటించేందుకు సిద్దం అవుతాడు అంటూ సమాచారం అందుతోంది.ఒక ఇంటర్వ్యూ సందర్బంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ మంచి కథ వస్తే వేరే హీరోలతో కలిసి నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా స్పందించాడు.

దాంతో ముందు ముందు కచ్చితంగా రాజశేఖర్ ను విలన్‌ పాత్రల్లో చూడటం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ సినిమా సక్సెస్ అయితే దర్శకురాలిగా జీవిత రాజశేఖర్‌ కంటిన్యూ అవ్వాలని భావిస్తుందట.

కూతుర్లు హీరోయిన్ లుగా కూడా ఆమె సినిమాలు చేయాలని సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కోరుకుంటున్నారు.మరి శేఖర్‌ ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube