పాపం హీరో గారి కూతురుకి ఆఫర్లు వస్తున్నాయి కానీ స్టార్‌ డమ్‌ రావడం లేదు

బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోల మరియు హీరోయిన్స్ ల కూతుర్లు హీరోయిన్స్ గా ఎంట్రీ మంచి విజయాలను సొంతం చేసుకున్నారు.

సౌత్‌ లో ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఏ ఒక్క హీరో కూతురు కూడా హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకోలేక పోయారు.

స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకోవడం లో విఫలం అయ్యారు.హీరోయిన్ గా స్టార్‌ డం సొంతం చేసుకోవడంలో విఫలం అవుతున్న శివాత్మిక రాజశేఖర్‌ అందుకు ఉదాహరణ అనడంలో సందేహం లేదు.

ఎన్నో సినిమాల్లో ఆఫర్లు దక్కించుకున్న ఈ అమ్మడు స్టార్ హీరోలకు జోడీగా మాత్రం స్థానం సొంతం చేసుకోలేక పోయింది.దొరసాని సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.ఇప్పుడు కూడా పలు సినిమా ల్లో నటిస్తూనే ఉంది.

అయినా కూడా ఈమెకు స్టార్‌ డమ్‌ అనేది దక్కడం లేదు.మినిమం చిన్న హీరోలతో కూడా ఈమె నటించలేక పోతుంది.

Advertisement

వారు కూడా ఈమెను పట్టించుకోవడం లేదు.కొత్త హీరోలు లేదా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు మాత్రమే ఈమె నటిగా పనికి వస్తుంది.

అందంగా కనిపించడంతో పాటు ఇతర కమర్షియల్‌ హీరోయిన్స్ మాదిరిగానే అందాల ఆరబోత విషయంలో తాను వెనక్కు తగ్గను అంటూ చెప్పేసింది.అయినా కూడా ఈమెను ఫిల్మ్‌ మేకర్స్ పట్టించుకోక పోవడం చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది అంటూ చాలా మంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేవలం రాజశేఖర్ యొక్క కూతురు అవ్వడం వల్లే శివాత్మకి రాజశేఖర్‌ కు ఆఫర్లు రావడం లేదని.ఆమె అక్క శివాని రాజశేఖర్‌ పరిస్థితి కూడా అదే విధంగా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.బాలీవుడ్‌ లో మాదిరిగా స్టార్‌ కిడ్స్ ను ఎందుకు మన హీరోలు పట్టించుకోవడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు