మా కోసం రాజశేఖర్ ఏం చేశాడో తెలుసా?  

Rajashekar Donate 10 Lakhs To Maa Association-rajashekar

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్‌ ప్రస్తుతం ‘మా’ వైస్‌ ప్రెసిడెంట్‌ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.మా అధ్యక్ష ఎన్నికల సమయంలో నరేష్‌ ఇంకా రాజశేఖర్‌ ప్యానల్‌ పలు సంక్షేమ పథకాలు అమలుకు హామీలు ఇచ్చారు.

Rajashekar Donate 10 Lakhs To MAA Association-Rajashekar

సంక్షేమం కోసం ఇచ్చిన హామీల అమలుకు మూల ధనం నిధులను ఉపయోగించవద్దు అనేది మా పెట్టుకున్న ఒక నిబంధన ఉంది.కాని ఇచ్చిన హామీల కోసం మా కొత్త కార్యవర్గం ఇప్పటి వరకు ఎలాంటి ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలు చేపట్టలేదు.

దాంతో వైస్‌ ప్రెసిడెంట్‌ గా ఉన్న రాజశేఖర్‌ స్వయంగా రూ.10 లక్షలు మా కోసం విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

Rajashekar Donate 10 Lakhs To MAA Association-Rajashekar

ఈ సందర్బంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ.సంక్షేమ కార్యక్రమాల కోసం నిధుల సేకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మూల ధనం నుండి తీసి ఖర్చు చేయవద్దనే ఉద్దేశ్యంలో ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం.అందులో భాగంగా మా కోసం నా వంతుగా రూ.

10 లక్షల విరాళం అందిస్తున్నాను.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తామంటూ రాజశేఖర్‌ పేర్కొన్నాడు.

ఇక గత కొన్ని రోజులుగా నరేష్‌ తో విభేదాలు అంటూ వస్తున్న వార్తలపై కూడా రాజశేఖర్‌ స్పందించాడు.నరేష్‌ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లే అన్నాడు.

చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు మరియు ఇతరుల సహకారంతో కార్యక్రమాలు నిర్వహించి ఫండ్స్‌ రైజ్‌ చేస్తామంటూ రాజశేఖర్‌ చెప్పుకొచ్చాడు.

తాజా వార్తలు