అయ్యో పాపం.. మరింత కష్టాల్లో జీవిత రాజశేఖర్‌ పెద్ద కూతురు

టాలీవుడ్‌లో వారసులు హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇవ్వడం చాలా తక్కువ.ఇచ్చిన ఒక్కరు ఇద్దరు కూడా పెద్దగా రాణించలేక పోయారు, పోతున్నారు.

 Rajashekar Daughter Shivatmika Movie Goes In Deep Trouble-TeluguStop.com

మంచు లక్ష్మి మరియు నిహారికలు హీరోయిన్స్‌గా గుర్తింపు దక్కించుకునే ప్రయత్నం చేసినా కూడా వారు సఫలం కావడం లేదు.ఇలాంటి సమయంలో జీవిత రాజశేఖర్‌ల కుమార్తెలు అయిన శివానీ మరియు శివాత్మికలు హీరోయిన్స్‌గా పరిచయం కాబోతున్నారు.

చిన్నమ్మాయి శివాత్మిక సినిమా కంటే పెద్దమ్మాయి శివానీ సినిమా ‘టూ స్టేట్స్‌’ దాదాపుగా సంవత్సం ముందు ప్రారంభం అయ్యింది.కాని శివాత్మిక సినిమా విడుదలకు సిద్దం అయ్యింది, శివానీ సినిమా ఇంకా సెట్స్‌ పైనే ఉంది.

అయ్యో పాపం మరింత కష్టాల్లో జ�

ఆమద్య శివానీ ‘టూ స్టేట్స్‌’ మూవీ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.షూటింగ్‌ ఆగిపోవడంకు కారణం ఏంటీ అనే విషయంపై క్లారిటీ రాలేదు.అయితే తాజాగా సినిమా ఆగిపోవడంకు కారణంపై క్లారిటీ వచ్చేసింది.టూ స్టేట్స్‌ మూవీకి మొదట దర్శకుడిగా వెంకట్‌ రెడ్డి ని ఎంపిక చేయడం జరిగింది.ఆయన దాదాపు 70 శాతం సినిమాను పూర్తి చేశాడట.ఆ సమయంలో నిర్మాతతో ఆయనకు విభేదాల కారణంగా ఆయన్ను సినిమా నుండి తొలగించి మరో దర్శకుడితో సినిమాను పూర్తి చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈస మయంలోనే దర్శకుడు వెంకట్‌ రెడ్డి కోర్టును ఆశ్రయించాడు.

అయ్యో పాపం మరింత కష్టాల్లో జ�

ఒప్పందం ప్రకారం కాకుండా సినిమాను మరో దర్శకుడితో పూర్తి చేస్తున్నారని, తనను కారణం లేకుండా తొలగించారు అంటూ నిర్మాణ సంస్థపై కోర్టులో దర్శకుడు ఫిర్యాదు చేయడం జరిగింది.మరో వైపు దర్శకుల సంఘంలో కూడా ఈ విషయమై ఫిర్యాదు చేశాడు.దాంతో సినిమా నిర్మాణం పూర్తిగా ఆగిపోయినట్లే అంటూ టాక్‌ వినిపిస్తుంది.

కోర్టు కేసుల నుండి శివానీ ఎప్పుడు బయట పడి టూ స్టేట్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుందో చూడాలి.ఈ చిత్రంలో హీరోగా అడవి శేషు నటిస్తున్న విషయం తెల్సిందే.

మరో వైపు శివాత్మిక మూవీ ‘దొరసాని’ జులై నెలలో విడుదలకు సిద్దం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube