రాజశేఖర్ కి జోడీగా ఫేడ్ అవుట్ హీరోయిన్ ని ఫైనల్ చేసిన నీలకంఠ

టాలీవుడ్ నటుడుగా ఎంట్రీ ఇచ్చి కెరియర్ లో వరుస సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు రాజశేఖర్.ఒకానొక దశలో రాజశేఖర్ టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ ని అందుకున్నాడు.అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాలలో నటించాడు.అతని సినిమాలో ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి.ఆ తరువాత కెరియర్ లో వరుస ఫ్లాప్ సినిమాలు పడటంతో వెనకబడిపోయాడు.ఒకానొక దశలో అతని సినిమాలు రిలీజ్ చేసిన కనీసం ఓపెనింగ్ కలెక్షన్ కూడా సొంతం చేసుకోలేకపోయాయి.

 Rajasekhar To Romance Young Lady Richa Panai, Tollywood, Telougu Cinema, Hero R-TeluguStop.com

రాజశేఖర్ సినిమా మార్కెట్ ఆ స్థాయిలోకి పడిపోయింది.అయితే మరల గరుడవేగ సినిమా తో యాంగ్రీ యంగ్ మెన్ గాడిలో పడ్డాడు.

ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు రాజశేఖర్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచిపోయింది.ఆ తరువాత కాస్తా గ్యాప్ తీసుకున్న సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.

ఒకప్పటి మాదిరి సినిమాలు చేయకుండా రొటీన్ కి భిన్నంగా కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు.ఈ నేపధ్యంలో ఫేడ్ అవుట్ దర్శకుడు నీలకంఠ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాజశేఖర్ కి జోడీగా ఫేడ్ అవుట్ అయిన రిచా పనయ్ ని హీరోయిన్ గా ఫైనల్ చేశారు.

అల్లరి నరేష్ యముడికి మొగుడు సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ తరువాత చేసిన సినిమాలు ఏవీ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.దీంతో గ్లామర్ గా ఉన్న కూడా దర్శకులు ఈ భామపై శ్రద్ధ చూపించలేదు.

అయితే ఇప్పుడు రాజశేఖర్ సినిమాలో అవకాశం పొందడం ద్వారా మరల ఈమె మీద టాలీవుడ్ ఫోకస్ పడే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube