యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తన రెండో ఇన్నింగ్స్‌ను గరుడవేగ చిత్రంతో అదిరిపోయేలా ప్రారంభించాడు.గరుడవేగ అందించిన సక్సెస్‌తో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు రాజశేఖర్.
అదే జోరులో ఆయన కల్కి అనే సినిమాను తీసి మరో హిట్ అందుకున్నాడు.ఇక తన నెక్ట్స్ మూవీని కూడా లైన్లో పెట్టాడు ఈ యాంగ్రీ స్టార్.
అయితే ఈ మూవీ ఓ మల్టీస్టారర్ మూవీ కానుందని తెలుస్తోంది.
దర్శకుడు వీరభద్రమ్ డైరెక్షన్లో రాజశేఖర్ ఓ యాక్షన్ మూవీకి రెడీ అవుతున్నాడు.
ఇందులో రాజశేఖర్‌తో పాటు మరో యంగ్ హీరో కూడా నటించనున్నాడట.ఈ హీరో పాత్రలో నటించేందుకు తొలుత యంగ్ హీరో శ్రీవిష్ణును సంప్రదించారు చిత్ర యూనిట్.
ఇక మరో యంగ్ హీరో కార్తికేయను కూడా చిత్ర యూనిట్ సంప్రదించింది.వీరిద్దరిలో ఎవరు ఓకే అన్నా వారితో సినిమా చేసేందుకు చిత్ర యూనిట్ రెడీగా ఉంది.
మరి యాంగ్రీ స్టార్‌తో కలిసి ఏ యంగ్ హీరో నటిస్తాడా అనే అంశం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.
అటు ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.ఏదేమైనా వరుస సక్సెస్‌లతో వెళ్తున్న రాజశేఖర్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి.