యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా లలిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శేఖర్. థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ సినిమాను ఎం.ఎల్.వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు.సినిమాలో రాజశేఖర్ తన ఒరిజినల్ ఏజ్ గెటప్ లో కనిపిస్తున్నారు.మిడిల్ ఏజ్ హీరో కథగా శేఖర్ కనిపిస్తుంది.గరుడవేగతో హిట్ అందుకున్న రాజశేఖర్ కల్కి జస్ట్ ఓకే అనిపించింది.ఇక శేఖర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు రాజశేఖర్.
షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగాలని చూస్తుంది.ఆల్రెడీ పొంగల్ వార్ లో ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యాం వస్తున్నాయి.పవన్ భీమ్లా నాయక్, మహేష్ సర్కారు వారి పాట కూడా సంక్రాంతికి రిలీజ్ షెడ్యూల్ చేశారు.మరి ఈ సినిమాల్లో ఏది రిలీజ్ అవుతుంది.ఏది వాయిదా పడుతుంది అన్నది చూడాలి.ఇక సంక్రాంతి బరిలో శేఖర్ సినిమా తప్పకుండా ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేస్తుందని చిత్రయూనిట్ చెబుతున్నారు.
ఈమధ్య హీరోగానే కాదు విలన్ గా కూడా తాను నటించేందుకు సిద్ధమని చెబుతున్నారు రాజశేఖర్.విలన్ గా సరైన ఛాన్స్ రావాలే కాని యాంగ్రీ యంగ్ మెన్ రాకశేఖర్ అదరగొట్టేస్తారని చెప్పొచ్చు.