ఆ సినిమా కోసం రాజశేఖర్ కి జోడీగా ఇద్దరు హీరోయిన్స్

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఈ మధ్య తన స్టైల్ పూర్తిగా మార్చేశాడు.రొటీన్ కథలని పక్కన పెట్టి కంటెంట్ బేస్ చిత్రాల వైపు మొగ్గు చూపిస్తున్నాడు.

 Rajasekhar Romance With Two Heroines In His Latest Movie-TeluguStop.com

గరుడవేగా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అనే థ్రిల్లర్ మూవీ చేశాడు.ఈ మూవీ మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

ప్రస్తుతం లలిత్ అనే కొత్త దర్శకుడుతో శేఖర్ టైటిల్ తో ఒక మూవీని స్టార్ట్ చేశాడు.ఈ మూవీ షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతుంది.

 Rajasekhar Romance With Two Heroines In His Latest Movie-ఆ సినిమా కోసం రాజశేఖర్ కి జోడీగా ఇద్దరు హీరోయిన్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో కాస్తా వయస్సు మళ్ళిన పాత్రలో రాజశేఖర్ తెల్లని గడ్డంతో కనిపిస్తున్నాడు.ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా ఇప్పటికే వచ్చి సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.

మలయాళీ హిట్ మూవీ రీమేక్ గా దీనిని తెరకెక్కిస్తున్నట్లు టాక్ తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం రాజశేఖర్ కి జోడీగా ఇద్దరు హీరోయిన్స్ ని ఎంపిక చేశారు.

జార్జ్ రెడ్డి ఫేం ముస్కాన్ ని ఇప్పటికే ఒక హీరోయిన్ గా ఖరారైంది.తాజాగా మలయాళీ భామ అను సితారని ఈ మూవీలో సెకండ్ లీడ్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

కథలో భాగంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అను సితార పాత్ర కనిపిస్తుందని టాక్.రివేంజ్ డ్రామాతో థ్రిల్లర్ఎలిమెంట్స్ తో ఈ మూవీ కథాంశం ఉండబోతుందని సమాచారం.

Telugu #muskaan, Anu Sithara, Corona, Director Lalith, George Reddy Fame, Jeevitha Rajasekhar, Rajasekhar, Rajasekhar Movie Update, Sekhar Movie, Sekhar Movie Shooting, Tollywood, Two Heroines-Movie

ఆ మధ్య రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడ్డారు.అతని పరిస్థితి కొద్దిగా సీరియస్ అయ్యింది.మళ్ళీ రికవరీ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నారు.కంప్లీట్ గా సెట్ అయ్యాక కరోనా పరిస్థితిని చూసుకొని శేఖర్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.దీంతో పాటు మరో యంగ్ డైరెక్టర్ తో కూడా థ్రిల్లర్ జోనర్ మూవీలో రాజశేఖర్ నటిస్తున్నాడు.

#Rajasekhar #Two Heroines #Anu Sithara #RajasekharMovie #Director Lalith

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు