యాంగ్రీ యంగ్ మెన్ తో రొమాన్స్ చేయబోతున్న జార్జ్ రెడ్డి హీరోయిన్

యాంగ్రీయంగ్ మెన్ రాజశేఖర్ ఈ మధ్యకాలంలో సినిమాల పరంగా కొత్తదనం ఉన్న కథలు ఎంపిక చేసుకుంటూ ముందుకి వెళ్తున్నాడు.ఒకప్పటి మాదిరిగా రెగ్యులర్ మూసధోరణి కథల జోలికి వెళ్ళకుండా కంటెంట్ బేస్ ఉన్న సినిమాలని చేస్తున్నాడు.

 Rajasekhar Romance With Bollywood Beauty-TeluguStop.com

ఈ నేపధ్యంలో గరుడవేగ, కల్కీ లాంటి సినిమాలు రాజశేఖర్ నుంచి వచ్చాయి.ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో కరోనా బారిన పడి కోలుకున్న రాజశేఖర్ మరల వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే మలయాళీ హిట్ మూవీ రీమేక్ శేఖర్ సినిమాలో నటించబోతున్నాడు.ఈ సినిమాతో పాటు మరో యంగ్ టాలెంటెడ్ దర్శకుడు చెప్పిన కథకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 Rajasekhar Romance With Bollywood Beauty-యాంగ్రీ యంగ్ మెన్ తో రొమాన్స్ చేయబోతున్న జార్జ్ రెడ్డి హీరోయిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శేఖర్ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ మధ్య రిలీజ్ అయ్యింది.ఇందులో రాజశేఖర్ కాస్తా ఏజ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాతో లలిత్ కుమార్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ముస్కాన్ ని ఫైనల్ చేశారు.

ఈ అమ్మడు ఇప్పటికే తెలుగులో జార్జ్ రెడ్డి సినిమాలో నటించింది.అందులో వాడు నడిపే బండి సాంగ్ తో భాగా పాపులర్ అయ్యింది.ఇక బాలీవుడ్ లో కూడా అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ యంగ్ బ్యూటీని శేఖర్ సినిమాలో హీరోయిన్ గా ఖరారు చేసినట్లు తెలుస్తుంది.త్వరలో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుందని సమాచారం.త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.

#DirectorLalith #Rajasekhar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు