నాకు అక్రమ సంబంధాలు ఉన్నాయి, కాని ఆమెతో లింక్ వద్దంటున్న రాజశేఖర్   Rajasekhar Opens Up On His Affairs After Marriage     2017-11-11   23:59:52  IST  Raghu V

ఇన్నాళ్ళు తెలుగు ప్రేక్షకులు హీరో రాజశేఖర్ ని దాదాపుగా మరచిపోయారు. కెరీర్ తొలినాళ్ళలో యాంగ్రీ యాంగ్ మాన్ గా, పోలీసు అంటే రాజశేఖర్ అనేట్టుగా ఒకదాని తరువాత ఒకటి, భారి బ్లాక్బస్టర్స్ సాధించారు రాజశేఖర్. అంకుశం, మగాడు వంటి చిత్రాలు వచ్చిన సమయంలో చిరంజేవి పోటిగా ఇకనుంచి నిలబడేది ఇతగాడే అనేంతగా సంచలనాలు సృష్టించిన ఈ డాక్టర్, ఆ తరువాత క్రమంగా తన మార్కెట్ కోల్పోతూ వచ్చాడు. ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ తెలుగు తెర మీది నుంచి కనుమరుగు అయిపోయిన పరిస్థితి వచ్చింది. అపుడెప్పుడో వచ్చిన ఎవడైతే నాకేంటి అనే ఒక్క సినిమా మినహాయిస్తే, మధ్యలో వచ్చిన రాజశేఖర్ సినిమాలేవో కూడా తెలుగు ప్రేక్షకులకి గుర్తుకు లేవు బహుశా.

ఏదైతే ఏం, PSV గడువ వేగ అనే సినిమాతో మళ్ళీ కంబ్యాక్ చేసారు డాక్టర్ గారు. ఈ సినిమా ఫలితాన్ని పక్కన పెడితే, ఇటు ప్రేక్షుకుల మెప్పు, అటు విమర్శకుల ఒప్పు పొందింది ఈ చిత్రం. మళ్ళీ రాజశేఖర్ పేరు జనాల్లో నానుతోంది. ఇదే అదనుగా చూసి మీడియా ఓ పాత రూమర్ ని తవ్వి తీసింది.

తార చౌదరి అనే పేరు గుర్తుకు ఉందా? ఏవో కొన్ని సినిమాలు చేసింది లెండి. వ్యభిచార వ్యాపారం చేస్తూ పట్టుబడిన ఆ నటిమణితో రాజశేఖర్ ఎఫైర్ నడుపుతున్నారని కొన్నేళ్లుగా ఓ రూమర్ ప్రచారంలో ఉంది. ఈ రూమర్ ని చాలాసార్లు ఖండించారు రాజశేఖర్. మధ్యలో రాజశేఖర్ కనిపించకపోవడంతో రూమర్ ని పక్కన పెట్టేసారు. ఇప్పుడు మళ్ళీ లేవనెత్తారు. చెప్పి చెప్పి విసుగొచ్చింది ఏమో, ఈసారి కొంచెం గట్టిగానే సమాధానమిచ్చారు రాజశేఖర్. తానేమి రాముడిని కాదని, తనకు ఎఫైర్స్ ఉన్నాయని, కాని ఈ తార చౌదరితో మాత్రం ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసారు రాజశేఖర్.

“నేనేమీ రాముడ్ని కాదు.పెళ్లికి ముందు కొందరితో, అలాగే జీవితతో పెళ్లి తర్వాత కూడా కొందరితో సంబంధాలున్నాయి కానీ తారా చౌదరితో మాత్రం ఎలాంటి సంబంధం లేదు” అంటూ పెళ్ళి తరువాత కూడా తన ఎఫైర్ పై రాజశేఖర్ మాట్లాడటం సంచలనాత్మకం.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.