రాజశేఖర్ చేస్తున్నది మలయాళీ రీమేక్ మూవీనే

సౌత్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ అంటే మలయాళీ చిత్ర పరిశ్రమ అని కచ్చితంగా చెప్పొచ్చు.అక్కడ దర్శకులు కొత్తదనం ఉన్న కథలు సిద్ధం చేస్తూ వాటిని స్టార్ హీరోలతో తెరకెక్కించి కమర్షియల్ సక్సెస్ లు అందుకుంటారు.

 Rajasekhar Next Is A Remake Of This Malayalam Hit, Director Nilakanta, Tollywood-TeluguStop.com

ఒకప్పుడు కేవలం బి గ్రేడ్ ఇండస్ట్రీగా ముద్ర పడిపోయిన మలయాళీ చిత్ర పరిశ్రమ ఇప్పుడు కొత్త కథల కర్మాగారంగా మారిపోయింది.మలయాళంలో తెరకెక్కిన సినిమాలని ఇతర బాషలలో రీమేక్ చేయడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

ముఖ్యంగా టాలీవుడ్ దర్శక, నిర్మాతల మలయాళం సినిమాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు.అక్కడ హిట్ అయిన సినిమాలని మన నేటివిటీకి తగ్గట్లు మార్చుకొని రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమా కోసం మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ని రీమేక్ చేస్తున్నారు.సుమారు పది మలయాళీ సినిమాల వరకు తెలుగులో రీమేక్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇప్పుడు యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కూడా మలయాళం సినిమాపైనే మనసు పడ్డాడు.తన నెక్స్ట్ సినిమాని మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాని రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

నేషనల్ అవార్డ్ విన్నర్ నీలకంఠ దర్శకత్వంలో రాజశేఖర్ ఒక సినిమా చేయడానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాని గరుడవేగా తరహాలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారనే టాక్ బయటకి వచ్చింది.

అయితే రెండేళ్ల క్రితం మలయాళంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ జోసెఫ్ చిత్రానికి రీమేక్ గా దీనిని రూపొందిస్తున్నారని ప్రస్తుతం టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.

త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube