‘శేఖర్’గా మారిన రాజశేఖర్.. ఫస్ట్ లుక్ కేక!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తన సెకెండ్ ఇన్నింగ్స్‌లో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలో ఆయన నటించిన గరుడవేగ, కల్కి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను రాబట్టాయి.

 Rajasekhar New Movie Titled Sekhar, Rajasekhar, Sekhar, Rs91, Tollywood News-TeluguStop.com

అయితే తన నెక్ట్స్ చిత్రం కోసం కొంత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ ప్రస్తుతం దర్శకుడు వీరభద్రం చౌదరి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాతో పాటు తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు ఈ సీనియర్ హీరో.

రాజశేఖర్ కెరీర్‌లో 91వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు శేఖర్ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు తొలుత నీలకంఠ డైరెక్టర్‌గా ఉన్నా, కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నాడు.దీంతో ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారా అనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాజశేఖర్ తెల్ల గడ్డం, తెల్ల జుట్టుతో చాలా ఫిరోషియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు.ఈ పోస్టర్‌తో ఈ సినిమా కథ ఏమిటో తెలుసుకోవడం కష్టంగా మారిందని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఎంఎల్‌వీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రాజశేఖర్ మరోసారి అద్భుతమైన హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు శేఖర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది.మరి శేఖర్ చిత్రం ఎలాంటి కథతో వస్తుందో, ఈ సినిమాతో రాజశేఖర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube