చిరంజీవి, నాగార్జున, బాలయ్య సినిమాలు ఫ్లాప్.. రాజశేఖర్ మూవీ హిట్.. ఏమైందంటే?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలకు పేరుంది.ఈ హీరోలకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే.

 Rajasekhar Movie Got Hit Result Remaining Star Heroes Got Flop Result Details, R-TeluguStop.com

అయితే ఒకే నెలలో ఈ హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ కాగా ఆ మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఆ తరువాత నెలలో విడుదలైన రాజశేఖర్ నటించిన సినిమా మాత్రం ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

కొన్నేళ్ల క్రితం వరకు హీరో రాజశేఖర్ ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలలో నటించారు.ఆ సినిమాలతో రాజశేఖర్ భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు.2001 సంవత్సరంలో నాగార్జున నటించిన బావనచ్చాడు సినిమా జూన్ నెల 7వ తేదీన విడుదలైంది.ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

ఆ తర్వాత వారం జూన్ నెల 15వ తేదీన బాలకృష్ణ నటించిన భలేవాడివి బాసు సినిమా విడుదలైంది.

భారీ అంచనాలతో బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఫెయిలైంది.

Telugu Chiranjeevisri, Flop Result, Rajasekar, Rajasekhar, Senior Heroes, Simhar

ఆ తర్వాత వారం చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన శ్రీ మంజునాథ సినిమా విడుదలైంది. శ్రీ మంజునాథ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.ఇలా ఒకే నెలలో వచ్చిన ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరచడం గమనార్హం.

Telugu Chiranjeevisri, Flop Result, Rajasekar, Rajasekhar, Senior Heroes, Simhar

అయితే ఆ తర్వాత నెలలో రాజశేఖర్ నటించిన సింహరాశి సినిమా జులై నెల 6వ తేదీన విడుదలైంది.సింహరాశి సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.రాజశేఖర్ మార్కెట్ ను పెంచిన సినిమాలలో సింహరాశి ఒకటని చెప్పవచ్చు.

రాజశేఖర్ కు జోడీగా ఈ సినిమాలో సాక్షి శివానంద్ నటించారు.బయ్యర్లకు ఈ సినిమా భారీ మొత్తంలో లాభాలను అందించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube