సునీల్ కూతురు ప్రాణాలు నిలబెట్టిన రాజశేఖర్.. ఏం జరిగిందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు సన్నిహితంగా ఉంటారు.ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా కూడా మెలుగుతారు.

 Rajasekhar Helped For Sunil Daughter Life Details, Hero Cum Comedian Suneel, Sun-TeluguStop.com

షూటింగ్స్ లేని సమయంలో ఇరు ఫ్యామిలీస్ కలిసి బయటకు కూడా వెళ్తుంటారు.కానీ ఇటువంటి విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు సెలెబ్రిటీలు.

కానీ ఏదో ఒక సందర్భంలో ఫలానా హీరో లేదా నటుడు ఈ విధంగా తన కుటుంబానికి సాయం చేశాడని చెప్పుకుని ఎమోషనల్ అవుతుంటారు.తాజాగా హీరో కమ్ కమెడియన్ సునీల్ హీరో రాజశేఖర్ గురించి చెప్పుకుని చాలా ఎమోషనల్ అయ్యారు.

టాలీవుడ్‌లో సీనియర్ హీరో రాజశేఖర్ అందరికీ సుపరిచితుడే.ఒకప్పుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ‘అల్లరి ప్రియుడు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుని ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.ఆ తర్వాత కొన్ని సినిమాలు హిట్ అవ్వగా, మరికొన్ని అంతగా రాణించలేదు.దీంతో కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాడు.

ఈ మధ్య కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజశేఖర్.ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన ‘గరుడవేగ’ మూవీతో హిట్ అందుకున్నారు.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు.ఇకపోతే రాజశేఖర్ వ్యక్తిగత జీవితంలో డాక్టర్ అని అందరికీ తెలిసిందే.

Telugu Allari Priyudu, Doctro, Garudavega, Cum Suneel, Raja Sekhar, Rajasekhar,

ఇటీవల హీరో కమ్ కమెడియన్ సునీల్ ఓ వేడుకలో భాగంగా హీరో రాజశేఖర్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.ఆ తర్వాత కొంత ఎమోషనల్ కూడా అయ్యాడు.రాజశేఖర్ అంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు.వ్యక్తిగతంగా తనకు ఎంతో సాయం చేశారని గుర్తుచేసుకున్నారు.రాజశేఖర్ డాక్టర్ కావడంతో ఒకానొక సందర్భంలో తన కూతురి ప్రాణాలను రక్షించారని చెప్పారు.

Telugu Allari Priyudu, Doctro, Garudavega, Cum Suneel, Raja Sekhar, Rajasekhar,

ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో రాజశేఖర్ తన బిడ్డకు చికిత్స అందించి ప్రాణాలను కాపాడారని వెల్లడించారు.రాజశేఖర్ వ్యక్తిగతంగా చాలా మంచి వారని, ఎవరైనా ఆపదలో ఉంటే ముందుండి సాయం చేస్తారని చెప్పుకొచ్చారు.ఇక రాజశేఖర్ భార్య జీవిత కూడా అటు నటిగా, కేంద్ర సెన్సార్ బోర్డు మెంబర్‌గా, సామాజిక సేవకురాలిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube