కోట్ల రూపాయలతోతో మోసం చేస్తున్న జీవిత రాజశేఖర్   Rajasekhar Family’s Illegal Deals In Crores     2017-11-14   23:16:29  IST  Raghu V

PSV గరుడ వేగ. బహుషా కొన్ని దశాబ్దాల తరువాత తెలుగువారిని మెప్పించిన స్పై థ్రిల్లర్. కొన్ని అరకొర సన్నివేశాలు తప్పిస్తే, వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో దీన్ని ఒక హాలివుడ్ డైరెక్టర్ లాగా నడిపించారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. రొటీన్ సినిమా మీదా ఆధారపడకుండా రాజశేఖర్ మంచి కంబ్యాక్ చేసారని పేరు వచ్చింది. ప్రవీణ్ సత్తారుకి పెద్ద పెద్ద అవకాశాలు వస్తున్నాయి. తదుపరి సినిమా నితిన్ నిర్మాణంలో ఉంటుంది. హీరో ఎవరో తెలియదు. నితినే హీరో అయితే ఆశ్చర్యపోనక్కరలేదు. ఆ తరువాత ఏకంగా ఒక హిందీ – తెలుగు బహుభాష చిత్రానికి ప్రవీణ్ దర్శకత్వం వహిస్తారు. దీన్ని ఓ పెద్ద బాలివుడ్ నిర్మాణ సంస్థ రెండు భాషల్లో నిర్మించి తమిళంలోకి అనువాదం కూడా చేస్తుంది. ఇందులో సుదీర్ బాబు హీరో. మొత్తం మీద మాట్లాడుకుంటే, హీరోకి, దర్శకుడికి మంచి పేరు వచ్చింది. మరి డబ్బుల సంగతి ఏమిటి?

ఈ సినిమాని పూర్తి చేయడానికి మేకర్స్ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. రాజశేఖర్ తో స్పై థ్రిల్లర్ అనగానే బడ్జెట్ ఎక్కువ ఉంటుందని భయపడి నిర్మాతలు ముందుకు రాలేదు. అతికష్టం మీద నిర్మాతలని పట్టారు. కాని కథ అనుసారం వారిదగ్గర ఉన్న డబ్బు సరిపోదు. దాంతో రాజశేఖర్ తన భూమిని (5000 sq.ft) తాకట్టు పెట్టి ఫైనాన్షియర్స్ దగ్గరి నుంచి అప్పు తీసుకొచ్చారు. నిర్మాతల డబ్బు, సొంత డబ్బు, తీసుకొచ్చిన అప్పు .. మొత్తం కలిపి పెడితే, సినిమా బడ్జెట్ 14 కోట్లు, కట్టిన ఇంటరెస్ట్ , ప్రమోషన్ ఖర్చులు కలుపుకొని మొత్తం 17 కోట్లకు పైగానే అయ్యింది. రాజశేఖర్ మార్కెట్ కి ఇది చాలా ఎక్కువ. సినిమాకి మంచి టాక్ వచ్చిన డబ్బు రికవరీ కాదు అని ముందే తెలుసు. అయినా ఎదో మూలా ఒక ఆశ. 7-8 కోట్ల షేర్ వచ్చినా, తెలుగు సాటిలైట్, హిందీ డబ్బింగ్ శాటిలైట్, ఇతర భాషల్లో రిమేక్ రైట్స్ అమ్ముకొని, ఆ 17 కోట్ల దగ్గరికి లెక్కని లాక్కురావాలి. నష్టాల శాతం ఎంత తగ్గితే అంత మంచిది అనుకున్నారు. కాని అప్పులు తీర్చే తొందరలో తప్పులు చేసారని ఫిలింనగర్ టాక్.

హిందీ డబ్బింగ్ రైట్స్ ని ఒకరికి తెలియకుండా మరొకరికి, ఇద్దరు వ్యక్తులకి అమ్మేసారట జీవిత రాజశేఖర్. ఇది తప్పు అని తెలుసు, రేపు గొడవల అవుతాయని కూడా తెలుసు. మరి ఎందుకిలా చేసినట్టు? తరువాతి సంగతి తరువాత, ముందైతే ముందున్న అప్పులు తీర్చేయ్యాలనా? ఇది మ్యాటర్ తెలియక నిర్మాత కూడా ఇంకెవరికో హిందీ శాటిలైట్ హక్కులని అమ్మేస్తున్న అని డీల్ కుదుర్చుకున్నాడట. నా అప్పులే తీర్చకుండా, సినిమాని హక్కులు ఎలా అమ్మేస్తారు అంటూ సదరు ఫైనాన్షియర్ కూడా గొడవలోకి దిగాడు. ఇన్ని ట్విస్టులు గరుడ వేగ సినిమాలో కూడా లేవు కదా.