నటి జీవిత,హీరో రాజశేఖర్ ల ఇద్దరు కుమార్తెలు శివాని,శివాత్మిక.వారిద్దరి ని కూడా వెండితెరకు పరిచయం చేయడానికి గత కొద్దీ కాలంగా మంచి ప్రణాళిక తో ముందుకు వెళుతున్నారు.
ఈ క్రమంలోనే వారి పెద్ద కుమార్తె శివాని ని వెండితెరకు పరిచయం చేయడానికి అంతా సిద్ధం కూడా అయిన సంగతి తెలిసిందే.గతేడాది శివాని ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని ప్రారంభించారు.
అయితే ఈ చిత్రం ప్రస్తుతం ఆగిపోయినట్లు తెలుస్తుంది.క్షణం,గూఢచారి చిత్రాల కథానాయకుడు అడవి శేషు కు జోడీ గా శివాని ఈ చిత్రంలో నటిస్తున్నారు.
హిందీ చిత్రం ఆయిన్ ‘2 స్టేట్స్’ చిత్రానికి ఇది రీమేక్ గా చెబుతున్నారు.
అయితే ఈ చిత్రం కోసం నూతన దర్శకుడు ని ఎన్నుకొని దర్శకత్వ భాద్యతలు అప్పగించారు.
కానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించే విధానం సరిగా లేదన్న కారణంగా ఈ చిత్రాన్ని నిలిపివేసినట్లు తెలుస్తుంది.దీనితో శివాని తెరంగేట్రం కొంచం ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది.మరోపక్క జీవిత,రాజశేఖర్ ల రెండో కుమార్తె శివాత్మిక కూడా వెండితెరకు పరిచయం కానుంది.అయితే శివాత్మిక చిత్రం దాదాపు పూర్తి అవుతుండగా పెద్ద కుమార్తె శివాని చిత్రం మాత్రం ఆగిపోవడం విశేషం.