పదేళ్ల తర్వాత గబ్బర్‌సింగ్‌ అంతాక్షరిని టార్గెట్‌ చేసిన రాజశేఖర్‌... ఏం చేశాడో తెలుసా?

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన గబ్బర్‌ సింగ్‌ చిత్రంలోని అంత్యాక్షరి ఎపిసోడ్‌ గుర్తుంది కదా, ఆ అంత్యాక్షరి ఎపిసోడ్‌లో రాజశేఖర్‌ మరియు జీవితాలను ఏ స్థాయిలో టార్గెట్‌ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.జీవిత రాజశేఖర్‌లు అప్పుడు తమ పేరు ఉపయోగించుకుని డబ్బులు సంపాదించాడంటూ కౌంటర్‌ ఇచ్చారు.

 Rajasekhar Counter To Gabbar Singh Dialogues-TeluguStop.com

అయితే తాజాగా ఇప్పుడు రాజశేఖర్‌ తన ‘కల్కి’ చిత్రంలో డైరెక్ట్‌గా ఆ అంత్యాక్షరి సీన్‌ను టార్గెట్‌ చేశాడు

పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన ఏం సెప్తిరి ఏం సెప్తిరి డైలాగ్‌ను రాజశేఖర్‌ చెప్పడంతో పాటు, కాస్త కౌంటర్‌ డైలాగ్‌ను రాజశేఖర్‌ చెప్పాడు.ప్రస్తుతం ఈ డైలాగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

భారీ ఎత్తున అంచనాలున్న కల్కి చిత్రంపై తాజాగా విడుదలైన కమర్షియల్‌ ట్రైలర్‌ అంచనాలను భారీగా పెంచేసింది.కమర్షియల్‌ ట్రైలర్‌ పేరుతో గబ్బర్‌సింగ్‌ అంత్యాక్షరి ఎపిసోడ్‌ను కామెడీ చేయడంపై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మెగా ఫ్యాన్స్‌ రెచ్చి పోతున్నారు

పదేళ్ల తర్వాత గబ్బర్‌సింగ్‌

రాజశేఖర్‌కు ఇన్నాళ్లకు గుర్తుకు వచ్చిందా అంటూ కామెంట్‌ చేస్తున్నారు.ఇక గబ్బర్‌సింగ్‌లో రాజశేఖర్‌ను ఇమిటేట్‌ చేసిన ఆంజనేయులు కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు.రాజశేఖర్‌ను ఇమిటేట్‌ చేసినట్లుగా ఎన్నో చిత్రాల్లో మరియు స్టేజ్‌ షోల్లో చేసిన ఆంజనేయులు ఈ చిత్రంలో కూడా అలా డాన్స్‌ చేస్తుంటే రాజశేఖర్‌ తన్నడం కూడా కామెడీ సీన్‌లా పెట్టారు.

మొత్తానికి కల్కి చిత్రంలో మెగా కాంపౌండ్‌పై పెద్ద ఎటాక్‌ ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube