కరోనా బారిన పడ్డ రాజశేఖర్ ఫ్యామిలీ  

Rajasekhar And Family Tested Corona Positive, Rajasekhar, Jeevitha Rajasekhar, Shivani Rajasekhar, Shivatmika Rajasekhar, Corona Positive - Telugu Corona Positive, Jeevitha Rajasekhar, Rajasekhar, Shivani Rajasekhar, Shivatmika Rajasekhar

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తన ప్రతాపాని చూపిస్తూనే ఉంది.ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి చాలా మంది అవస్థలు పడుతున్నారు.

TeluguStop.com - Rajasekhar And Family Tested Corona Positive

కాగా సామాన్య ప్రజలే కాకుండా సెలెబ్రిటీలు సైతం ఈ వైరస్ సోకడంతో బెంబేలెత్తిపోతున్నారు.ఇక టాలీవుడ్‌లో కూడా కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది.

ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు ఈ వైరస్ బారిన పడగా, తాజాగా ఓ స్టార్ ఫ్యామిలీ ఈ మహమ్మారి బారిన పడ్డారు.

TeluguStop.com - కరోనా బారిన పడ్డ రాజశేఖర్ ఫ్యామిలీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

యాంగ్రీ స్టార్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత రాజశేఖర్, కూతుళ్లు శివానీ, శివాత్మికలు కరోనా బారిన పడ్డారు.

ఈ మేరకు రాజశేఖర్ స్వయంగా ఓ ప్రకటన చేశారు.తన కుటుంబానికి కరోనా వైరస్ సోకిందని, అయితే ఎవరూ భయపడాల్సిన పని లేదని ఆయన అన్నారు.తన కూతుళ్లు త్వరగా కోలుకుంటున్నారు, తన భార్యతో పాటు రాజశేఖర్ కూడా వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఈ వార్తతో ఒక్కసారిగా యావత్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.

ఇలా ఓ స్టార్ ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడటంతో, ఈ వ్యాధి ఇంకా ఎంతమందికి సోకుతుందో అని ఇండస్ట్రీవారు భయాందోళనకు గురవుతున్నారు.కాగా ఇటీవల తనకు కరోనా సోకిందని వెల్లడించిన మిల్కీ బ్యూటీ తమన్నా, తాజాగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యింది.

తాను కరోనాను గెలిచేందుకు సహాయపడ్డ వైద్యులు, నర్సులకు ఆమె ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.ఏదేమైనా కరోనా కాటుకు సామాన్యులే కాదు సెలెబ్రిటీలు సైతం విలవిలలాడుతుండటంతో మిగతావారు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రాజశేఖర్ కూతురు శివాత్మిక ఇప్పటికే హీరోయిన్‌గా పరిచయం కాగా, శివానీ ప్రస్తుతం హీరోయిన్‌గా టాలీవుడ్ తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే.

#Rajasekhar #Corona Positive

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajasekhar And Family Tested Corona Positive Related Telugu News,Photos/Pics,Images..