లంకలో కొనసాగనున్న అన్నదమ్ముల పాలన

శ్రీలంక ప్రధాని గా,అధ్యక్షులుగా ఇద్దరు అన్నదమ్ములు పరిపాలన కొనసాగించనున్నారు.గత 3 దశాబ్దాలకు పైగా సాగిన ఎన్ టీటీఈ పోరాటాన్ని అంతం చేసిన రాజపక్స సోదరులు దేశ అత్యున్నత పదవులను అధిరోహిస్తున్నారు.

 Rajapaksa Brothers Going To Set Dominate Srilanka-TeluguStop.com

శ్రీలంక కొత్త అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రధాని రణిల్‌ విక్రమసింఘె తన పదవికి బుధవారం రాజీనామా చేయడం తో ఆ వెంటనే కొత్త ప్రధానిగా తన సోదరుడు మహింద రాజపక్సెను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రకటించారు.మహింద రాజపక్సె పార్లమెంట్‌లో ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అయితే మాజీ అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన గత ఏడాది అక్టోబర్ 26న మహిందా రాజపక్స ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినా… దాదాపు నెలన్నర మాత్రమే ఆ పదవిలో కొనసాగారు.ప్రధాని రణిల్ విక్రమ సింఘేను తప్పించి రాజపక్సను ఆ పదవిలో నియమించారు అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన.అయితే… దీని వల్ల దేశంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది.మహిందా రాజపక్స నియామకం చెల్లదని శ్రీలంక సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

దీంతో గత ఏడాది డిసెంబర్‌ 15న ప్రధాని పదవి పదవి నుంచి మహిందా రాజపక్స తప్పుకోవాల్సి వచ్చింది.

Telugu Rajapaksa, Ranilvikram-

తాజా ఎన్నికల్లో గొటబాయా రాజపక్స శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికవడంతో తన అన్న మహిందా రాజపక్సను ప్రధాన మంత్రిగా నియమించారు.2005 నవంబర్‌లో 19న తొలి సారిగా అధ్యక్ష పదవి చేపట్టిన మహిందా రాజపక్స… 2015 జనవరి 9 వరకూ ఆ పదవిలో కొనసాగారు.దక్షిణాసియాలోనే అత్యధిక కాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించారు.

మహిందా రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో… అతని సోదరుడు గొటబాయా రాజపక్స సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించారు.అంతకు ముందు 1970లో అతి చిన్న వయసులోనే పార్లమెంట్‌కు ఎన్నికై రికార్డు సృష్టించారు మహిందా రాజపక్స.

అప్పటికి ఆయన వయస్సు 24 ఏళ్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube