' ఆటో ' లో ఎంట్రీ కి పొలిటికల్ ' భాషా ' రెఢీ ?

తమిళనాడు రాజకీయాల్లో సునామీ సృష్టించేందుకు తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సిద్ధమైపోయారు.ఈ మేరకు ఆయన ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర తన కొత్త పార్టీ పేరును రిజిస్టర్ చేయించడం కూడా పూర్తి అయిపోయింది.

 Rajanikanth Start New Political Party Symbol Is , Auto Riksha, Bjp, Delhi, Elect-TeluguStop.com

ఇక ఎన్నికల గుర్తు కూడా దాదాపుగా ఖరారైపోయింది.ఈ నేపథ్యంలో రజిని రాజకీయం ఏ విధంగా ఉండబోతోంది ? ఆయన పొలిటికల్ ఎంట్రీ ఏ పార్టీకి మేలు చేస్తుంది  ? మరే పార్టీ నష్టపోతుంది అని లెక్కలు ఎన్నో మొదలయ్యాయి.ఆయన మొదటి నుంచి బీజేపీకి మద్దతు గా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వస్తుండడంతో, అంతే స్థాయిలో బిజెపి రజిని కి ప్రాధాన్యం ఇవ్వడం వంటి కారణాలతో రజనీ మద్దతు బీజేపీకి ఉండబోతోంది అనే ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే రజనీకాంత్ నటించిన భాష సినిమాలో ఆయన ఆటో డ్రైవర్ గా తన నట విశ్వరూపం చూపించారు.

ఇప్పటికీ తమిళనాడుతో పాటు అనేక రాష్ట్రాల్లోనూ ఆటోడ్రైవర్లు అంతా భాషా సినిమాలో ని రజిని ఆటో డ్రైవర్ స్టైల్ ను ఫాలో అవుతూ వస్తున్నారు.అందుకే  ఇప్పుడు రజినీకాంత్ ఎన్నికల గుర్తు కూడా అదే ఆటో గుర్తు తీసుకోవడం ద్వారా జనాల్లోకి సులువు గా వెళ్ళవచ్చు అనే ప్లాన్ లో రజనీ ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నెల 31వ తేదీన రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై స్పష్టమైన క్లారిటీ రాబోతోంది.  ఆయనే స్వయంగా తన పార్టీ పేరును ప్రకటించబోతున్నారు.” మక్కల్ సేవై కర్చీ ‘ (ప్రజా సేవ పార్టీ ) అనే పేరు కూడా రిజిస్టర్ అయినట్లు సమాచారం.తమిళనాడులో ఉన్న మొత్తం 234 నియోజకవర్గాల్లో నూ రజినీకాంత్ పార్టీ ‘ మక్కల్ సేవై కర్చీ ‘ పార్టీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు గా సమాచారం మొదటగా రజిని పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ అని ప్రచారం జరిగినా, ఆ గుర్తు ఇచ్చేందుకు అవకాశం లేకపోవడంతో, ఆటో గుర్తు అందుబాటులో ఉండడంతో రజిని ఆటో వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube