తమిళ, తెలుగు భాషల్లో నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకోవడంతో పాటు ఇతర దేశాల్లో కూడా కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్.కేంద్ర ప్రభుత్వం ఇటీవల రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డును కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏడు పదుల వయస్సులో కూడా రజనీకాంత్ నటనకు దూరం కాలేదు.సూపర్ స్టార్ రజనీకాంత్ అంతులేని కథ మూవీతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు.
బాలచందర్ డైరెక్షన్ లో తెరకెక్కిన అంతులేని కథ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాలో రజనీకాంత్ త్రాగుబోతు పాత్రలో నటించారు.ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటించగా రజనీకాంత్ కు 1,000 రూపాయల పారితోషికం, కమల్ హాసన్ కు 1,500 రూపాయల పారితోషికం లభించింది.అంతులేని కథ సినిమాలోని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఇప్పటికీ వినిపిస్తూ ఉన్నాయి.
ఆ తరువాత రజనీకాంత్ తమిళంలో నటించిన సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ కావడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి.ఈ మధ్య కాలంలో తెలుగులో రోబో, రోబో 2.0 సినిమాలు మినహా సక్సెస్ లేని రజనీకాంత్ అన్నాత్తే సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని భావిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.
మరోవైపు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు రజనీకాంత్ ప్రకటించారు.
వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోవడానికి కారణమని తెలుస్తోంది.
పార్టీ పెట్టినా అధికారంలోకి రావడం సాధ్యం కాదని పలు సర్వేల్లో తేలడంతో రజనీకాంత్ రాజకీయాలపై ఆసక్తి చూపలేదని సమాచారం.రేపు తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూడాల్సి ఉంది.డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వేల్లో వెల్లడైంది.