తన భార్యతో పాటు సర్వస్వం  పోయిందంటున్న ప్రముఖ హీరో...  

భార్యాభర్తల మధ్య వివాదాలు మరియు మనస్పర్ధలు ఏర్పడినప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే వారి జీవితాలు విచ్ఛిన్నమవుతాయనడంలో ఎటువంటి సందేహము లేదు.అయితే ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమలో ఎంతో మంచి పేరు ఉన్నటువంటి హీరో తన భార్య తన జీవితంలో వెళ్లిపోయినప్పటి నుంచి సర్వస్వం కోల్పోయి బాధపడుతూ తన జీవితాన్ని పూలపానుపు నుంచి ముళ్ల వైపు చేసుకున్నాడు.

TeluguStop.com - Rajani Nataraj Ramesh Kudawla

వివరాల్లోకి వెళితే 2009వ సంవత్సరంలో వెన్నెల కబడ్డీ కోజు అనే తమిళ చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన టువంటి విష్ణు విశాల్ మంచి హిట్ ని సాధించి తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ కొన్ని చిత్రాలను నిర్మించాడు కూడా.

అయితే జీవితంలో ఒకానొక దశలో విష్ణు విశాల్ మంచి ఫామ్ లో ఉన్నటువంటి సమయంలోనే తన భార్యతో విడిపోయాడు. దాంతో ఒక్కసారిగా మానసిక వేదనతో కుంగిపోయాడు.

అంతేగాక తాగుడుకు బానిసై తన కుటుంబాన్ని సైతం మర్చిపోయి మత్తులో మునిగి పోయాడు.దీంతో తన సొంత నిర్మాణ సంస్థపై సరిగా శ్రద్ధ పట్టకపోవడంతో పెట్టకపోవడంతో తను నిర్మించిన పలు చిత్రాలు భారీ నష్టాలను చవి చూశాయి. దీంతో ఆర్థిక పరమైన సమస్యలతో సతమతమవుతూ జీవితం చాలా దుర్భరంగా మారిపోయింది.

అయితే వీటి నుంచి బయటపడడానికి ప్రస్తుతం విష్ణు విశాల్ తన సొంత బ్యానర్ లోనే ఓ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నాడు.

 ఇందులో భాగంగానే ఓ మంచి కథను ఎంచుకొని చిత్రం షూటింగ్ పనులు కూడా ప్రారంభించాడు. అయితే ఈ మధ్యనే షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో గాయపడ్డాడు.దీంతో  వైద్యులు అతనికి రెండు నెలలపాటు  విశ్రాంతి అవసరం అని చెప్పగా  ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపాడు విష్ణు విశాల్.

#Kollywood #VishnuVishal #VishnuVishal #VishnuVishal #Vishnu Vishal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు