సైరా లో చిన్న పాటి పాత్రలో కనిపించనున్న తలైవా  

Rajani Kanth In Saira Movie-nayanatara,rajani Kanth,saira Narasimha Reddy,sudheep,సుదీప్,సైరా

మెగాస్టార్ చిరంజీవి ఏంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇప్పటికే ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో భారీ కాస్టింగ్ కూడా ఉండడం తో ఈ చిత్రంపై మరిన్ని అంచానాలు పెరిగాయి..

సైరా లో చిన్న పాటి పాత్రలో కనిపించనున్న తలైవా -Rajani Kanth In Saira Movie

అయితే ఇప్పటికే అమితాబ్,విజయ్ సేతుపతి,సుదీప్,నయనతార,తమన్నా,మెగా ఫ్యామిలీ డాటర్ నిహారిక తదితరులు ఉన్న సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు తలైవా రజనీకాంత్ కూడా ఒక చిన్న పాటి రోల్ చేయనున్నట్లు తెలుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో తమిళనాడులో హైప్ తీసుకొచ్చేందుకు ఈ సినిమాలో రజినీకాంత్ చేత ఓ చిన్న పాత్ర చేయించాలని అనుకుంటున్నట్టు సమాచారం.

ఎంత చిన్న రోల్ అయినా ఫర్వాలేదు, రజినీకాంత్ అలా కనిపిస్తే చాలు… తమిళనాడులో హైప్ వస్తుందని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే… అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో రజిని. చిరంజీవిలు కలిసి ఒక సినిమా చేశారు. అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తరువాత మరోసారి ఆ ఇద్దరూ స్క్రీన్ పై కనిపించనున్నారన్నమాట.