కమల్‌ గురించి రజినీ ఆసక్తికర వ్యాఖ్యలు.. వావ్‌ అనాల్సిందే!   Rajani Kanth Comments On Kamal Hassan     2018-11-08   11:11:10  IST  Ramesh P

కోలీవుడ్‌ తో పాటు సౌత్‌లో సూపర్‌ స్టార్‌గా వెలుగు వెలుగుతున్న రజినీకాంత్‌ త్వరలో 2.ఓ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన రజినీకాంత్‌ పలు ఆసక్తికర విషయాల గురించి మాట్లాడటం జరిగింది. ఈ సమయంలోనే తన తోటి స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ గురించి చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రజినీకాంత్‌ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

తానో సూపర్‌ స్టార్‌ అయినా కూడా తోటి హీరో కమల్‌ హాసన్‌ గురించి గొప్పగా మాట్లాడాడు. తనకంటే కూడా కమల్‌ హాసన్‌ గొప్ప నటుడు, గొప్ప వ్యక్తి అంటూ రజినీకాంత్‌ పేర్కొన్నాడు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలు కమల్‌ హాసన్‌ అప్పటికే హీరోగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆయన సినిమాలు నేను కూడా చాలా చూసేవాడిని. అప్పట్లో ఆయనతో ఒకసారి కలవడమే గొప్ప అనుకున్నాను. ఒకానొక సారి కమల్‌ హాసన్‌ బండిపై నేను ఎక్కాను. అప్పుడు నన్ను నేను నమ్ముకోలేక పోయాను. నిజంగా నేను కమల్‌ బండి ఎక్కాను అంటే నమ్మబుద్ది కాలేదు. కమల్‌ ఎలాంటి పాత్ర చేసినా కూడా అందులో ఒదిగి పోతాడు. కమల్‌ నా కంటే గొప్పవాడు అంటూ రజినీకాంత్‌ అన్నాడు.

Rajani Kanth Comments On Kamal Hassan-

ఇక సూపర్‌ స్టార్‌ అయ్యి ఉండి మీరు ఇంత సింపుల్‌ గా ఎలా ఉంటారు అంటూ విలేకరి ప్రశ్నించిన సమయంలో మరో ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. నేను సింపుల్‌ అని మీరు ఎలా చెబుతున్నారు. నేను తిరిగే కారు అత్యంత ఖరీదైనది, నేను ఉండే పోయేస్‌ గార్డెన్‌ ఏరియా చెన్నైలోనే అత్యంత రేటు పలికే ఏరియా. అలాంటి ఏరియాలో నేను ఉంటూ, ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లో తింటూ ఉంటే నేను ఎలా సింపుల్‌ జీవితాన్ని గడుపుతున్నట్లుగా మీరు భావిస్తున్నారు అంటూ విలేకరిని ఎదురు ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలతో రజినీకాంత్‌ తన అభిమానుల్లో మరింత అభిమానంను పొందిన వాడు అయ్యాడు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.