రాజమౌళి ప్లాన్ మళ్ళీ ఫేయిల్ అయ్యింది   Rajamouli’s Plan Failed Once Again     2017-01-03   22:06:45  IST  Raghu V

రాజమౌళి ఒక ఖచ్చితమైన ప్లాన్ తో నడిచే మనిషి. అందుకే ఆయన సినిమల ఔట్ పుట్, ఆ తరువాత బాక్సాఫీస్ ఫలితం అలా ఉంటాయి. బాహుబలి తెరపై ఆయన ప్లానింగ్ కి అతిపెద్ద ఉదాహరణ అయితే, తెరవెనుక అదే బాహుబలి ఆయన ప్లాన్స్ ఫేయిల్ కూడా అవుతాయని చెప్పటానికి కూడా ఉదాహరణగా పనికివస్తుంది.

కొత్తగా చెప్పేదేముంది. బాహుబలి మొదటిభాగం విడుదలలో కొంత ఆలస్యం జరిగిన మాట తెలిసిందే. ఆ తరువాత రెండొవభాగాన్ని 2016 సంవత్సరంలోనే తీసుకొస్తాని ప్రకటించిన జక్కన్న మాట మీద నిలబడలేకపోయాడు. మొత్తానికి బాహుబలి రెండొవభాగం ఏప్రిల్ కి షిఫ్ట్ అయ్యింది.

ఇక తాజాగా ఫేయిల్ అయిన మరో ప్లాన్ బాహుబలి షూటింగ్. డిసెంబరులో బాహుబలి 2 షూటింగ్ మొత్తం పూర్తవుతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళి షెడ్యూలు అలానే ఉండింది మరి. కాని షెడ్యూలు ఫేయిల్ అయ్యింది. బాహుబలి 2 షూటింగ్ ఇంకా పూర్తవలేదు. ఈ నెలలో సినిమా షూట్ మొత్తం కంప్లీట్ అవుతుంది.

అయితే పెద్దగా కంగారుపడవద్దు. బాహుబలి 2 విడుదలలో ఆలస్యం జరగటానికి అవకాశాలు లేవు. సినిమా అనుకున్నట్టుగానే ఏప్రిల్ 28, 2017 న విడుదల కాబోతోంది.