ఆర్ఆర్ఆర్ మూవీ థీమ్ ఏంటో చెప్పిన రాజమౌళి

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, తారక్ తో భారీ మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీగా ఆర్ఆర్ఆర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి.

 Rajamouli Share Rrr Main Concept Theme Related To Water And Fire, Tollywood, Jr-TeluguStop.com

తాజాగా వచ్చిన మోషన్ పోస్టర్, రామ్ చరణ్ అల్లూరి పాత్ర టీజర్ అన్ని భాషలలో ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.ఇక ఈ మోషన్ పోస్టర్ లో రామ్ చరణ్ ని ఫైర్ తో, ఎన్టీఆర్ పాత్ర ని వాటర్ తో రిప్రజెంట్ చేస్తూ రాజమౌళి ఆవిష్కరించాడు.

దీనిని చూసిన తర్వాత రాజమౌళి ఈ సినిమా కాన్సెప్ట్ ద్వారా నేచర్ గురించి ఏదో పాయింట్ చెప్పబోతున్నాడు అని అందరూ భావించారు.అయితే సినిమాలో ఇద్దరి పాత్రలు నిజజీవిత పాత్రలైనా అల్లూరి, కొమరం భీమ్ వి కావడంతో వాటికి నేచర్ కి సంబంధం ఏంటి అనే విషయంపై అందరూ ఆలోచనలో పడ్డారు.

అయితే ఈ నీరు, నిప్పుతో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలని రిప్రజెంట్ చేయడంలో ఉన్నథీమ్ ని రాజమౌళి రివీల్ చేశారు. అల్లూరి అగ్ని వలె జ్వలించే స్వభావం గల వ్యక్తి అని, అలానే భీం నీరు వలె పారే స్వభావం గల వ్యక్తి అని, నిజానికి అగ్ని, నీరు రెండు భిన్నమైన స్వభావాలతో ఉన్నవి.

అలానే ఒకదానిని మరొకటి అంతం చేయగల శక్తి ఉన్నవి, మరి అంత శక్తివంతమైన స్వభావాలు గల ఈ రెండు కలిస్తే యావత్ ప్రపంచాన్నే ఒక పెద్ద మోటారులా ముందుకు నడిపించగలవు అనే థీమ్ తో సినిమా సాగుతుందని తెల్పడం జరిగింది.రాజమౌళి తెలిపిన ఈ విషయాన్ని సినిమా నిర్మాతలైన డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది.

ఒక విధంగా చెప్పాలంటే ఈ థీమ్ ప్రకారం ప్రకృతి స్వభావాన్ని రాజమౌళి ఇందులో పాత్రల ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు అని తెలుస్తుంది.అయితే వీటిని ఎలా హ్యాండిల్ చేసి చూపిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube